Hyderabad Meerpet Murder Deadbody in Cooker | హైదరాబాద్ లోని జిల్లెలగూడ మీర్‌పేట్ హత్య కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యను అనుమానించి అతి దారుణంగా చంపిన ఓ భర్త గురించి తెలిసి అందరూ షాకైపోతున్నారు. హత్య చేసే ముందు అతను ఎంత పక్కాగా ప్లానింగ్ చేశాడో పోలీసులు వివరించడంతో అతనో సైకోలా తలపిస్తున్నాడు.
అనుమానం… విషాదానికి పునాది
జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి, డీఆర్‌డీఓలో ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ, తన భార్య వెంకట మాధవి, ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లోని న్యూ వెంకటేశ్వర నగర్‌లో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానంతో గొడవలు పెంచుకున్న ఆయన, సంక్రాంతి పండుగ రోజు హత్య చేయడానికి అవకాశం కోసం వాడుకున్నాడు. పిల్లలను ఊరికి పంపించిన తర్వాత, ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవిని దారుణంగా హతమార్చాడు.
13వ తేదీన ప్లాన్ అమలు
తన భార్య మాధవిని మిస్సింగ్‌గా చూపిస్తూ, మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతవరకు ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా అమాయకంగా నటించాడు. కానీ మాధవి పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో.. పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. పలు సీసీటీవీ ఫుటేజీలు, ఆధారాలతో పోలీసులు అతడిని ప్రశ్నించగా.. అసలు నిజం బయటపడింది.
Also Read: అడవిలో 11 ఏళ్ల బాలుడి శవం.. పిల్లాడి కోసం వెతుకుతున్నట్లు హంతకుడి డ్రామా
రోమాలు నిక్కపొడుచుకునేలా హత్యకు ప్లానింగ్
మాధవిని హత్య చేసిన గురుమూర్తి, శరీర భాగాలను ముక్కలుగా కోసి, వాటిని కుక్కర్‌లో ఉడకబెట్టాడు. ఆ తర్వాత చెరువులో వదిలేశాడు. విచారణలో పోలీసుల ముందు అతను అంగీకరించిన షాకింగ్ నిజాలు:
హత్యకు ముందు ట్రయల్‌గా ఓ కుక్కను చంపి, అదే విధంగా ప్రాక్టీస్ చేసాడు. మాంసాన్ని ఎముకల నుంచి వేరుచేసి, ఎముకలను కాల్చి పొడిచేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టే ముందు నిందితుడు.. యూట్యూబ్, గూగుల్ వీడియోలు చూసి ఎలా చంపాలో ప్లానింగ్ చేశాడు.
మరింత లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు..
గురుమూర్తి చేసిన ఈ దారుణానికి కేవలం అనుమానం మాత్రమే కారణమా? లేక మరేదైనా ఆత్మహత్యా కోణం ఉందా? లేదా ఇతరులెవరైనా అతనికి హత్యకి సహకారించారా? అన్న అంశాలపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: డాక్టర్ చేతిలో పేషెంట్ సజీవ దహనం!.. వైద్యుడే హంతకుడు
భయభ్రాంతులకు గురవుతున్న చుట్టుపక్కల నివాసితులు
ఈ ఘటన బయటకు రావడంతో గురుమూర్తి నివసించిన బిల్డింగ్ పూర్తిగా ఖాళీ అయింది. చుట్టుపక్కల వారు ఇలాంటి సంఘటన తమ జీవితాల్లో చూడలేదంటూ భయపడిపోతున్నారు.
ఈ సంఘటన గురించి తెలిసి.. కుటుంబ బంధాలు మరీ ఇంత హింసాత్మకంగా ఉంటాయా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.