England players – RCB: ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మొదటి టీ-20 బుధవారం రోజు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ టీమ్.. భారత బౌలర్ల ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 132 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.
Also Read: Abhishek Sharma: ఇంగ్లాండ్ అంటే గురువు, శిష్యులకు పండగే.. యూవీ సరసన అభిషేక్ శర్మ ?
ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జోష్ బట్లర్ మినహా మరెవ్వరూ రాణించలేదు. జోస్ బట్లర్ 44 బంతులలో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు హ్యారీ బ్రూక్ 17, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. అయితే ఈ తొలి టి-20లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడం మాట పక్కన పెడితే.. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) జట్టు తీవ్రంగా ట్రోల్స్ కి గురవుతుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి)కి టైటిల్ అనేది ఓ అందని ద్రాక్షలా మారింది.
జట్టులోని ఆటగాళ్లు మారినా.. కెప్టెన్లను మారుస్తున్నా.. ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. కేవలం విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఫాలోయింగ్ ఉంది. ఈ అభిమానులంతా ఆ జట్టు ఎప్పుడూ టైటిల్ గెలుస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అటు ఆర్సీబీ సైతం ఐపీఎల్ 2025 మెగా వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లనే కొనుగోలు చేసింది.
హిట్టర్లు లివింగ్ స్టోన్, ఫీల్ సాల్ట్, టీమ్ డేవిడ్, జితేష్ శర్మ లను తీసుకుంది ఆర్సిబి. జట్టు మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో పూర్తిగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. హిట్టర్స్ జట్టులోకి వచ్చిన వేళ ఐపీఎల్ 2025లో ఆర్సిబికి కలిసొస్తుందని అంతా భావించారు. కానీ ఈసారి కూడా ఆ జట్టుకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఎందుకంటే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ-20లో ఆర్సిబి ప్లేయర్లు పూర్తిగా విఫలమయ్యారు.
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు హిట్ బ్యాటర్లు ఫీల్ సాల్ట్, లివింగ్ స్టోన్ ఈ తొలి టి-20లో ఒక్క పరుగు చేయకుండానే వెనుదిరిగారు. వీరిద్దరూ 3 బంతులకు మించి క్రీజ్ లో నిలువలేకపోయారు. మరో యంగ్ ప్లేయర్ జాకోబ్ బేతేల్ 14 బంతులలో కేవలం 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
Also Read: Abhishek – Ball Exercise: 8 సిక్సులతో ఊచకోత.. అభిషేక్ బాల్ ఎక్సర్‌సైజ్ రహస్యం ఇదే?
ఈ ముగ్గురు ప్లేయర్లు దారుణంగా విఫలం కావడంతో.. ఆర్సిబి దరిద్రం అంటే ఇదే అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరికొద్ది రోజులలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ ప్లేయర్లను పెట్టుకుని టోర్నమెంట్ లో అడుగుపెడితే గెలవడం కష్టమేనని అటు ఆర్సిబి అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం కేవలం ఒక్క మ్యాచ్ లో రాణించలేకపోయినంత మాత్రాన ఇలా ట్రోల్స్ చేయడం తగదని అభిప్రాయపడుతున్నారు.
Three England players who are set to feature for RCB in the upcoming IPL have been dismissed for single-digit scores 🏴👀#PhilSalt #LiamLivingstone #JacobBethell #RCB #Sportskeeda pic.twitter.com/B35js7olC5
— Sportskeeda (@Sportskeeda) January 22, 2025