Nazi Gold Train: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింతల్లో ఒకటి నాజీ బంగారం రైలు కథ. సుమారు 80 సంవత్సరాల క్రితం 300 టన్నుల బంగారంతో ఓ రైలు ఒక సొరంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆ రైలు మాయం అయ్యింది. ఇప్పటికీ, బంగారంతో నిండిన రైలు కోసం ప్రపంచం వెతుకుతోంది. కానీ, ఆచూకీ దొరకలేదు.
రోనాల్డ్ జ్వేగ్ తన పుస్తకంలో ఈ నాజీ రైలు గురించి రాశారు. హంగేరియన్ యూదుల నుంచి దొంగిలించిన బంగారం, నగలు, విలువైన వస్తువులతో ఆ రైలు నిండి ఉందని ఆ పుస్తకంలో వివరించారు. ఈ రైలు బుడాపెస్ట్ నుంచి బయలుదేరింది. కానీ, ఆస్ట్రియాలోని ఆల్ప్స్ లో ఉన్న ఒక సొరంగంలో ఆగిపోయింది. వారు టైరోల్, ఫెల్డ్ కిర్చ్ లోని వివిధ ప్రాంతాలలో కొంత బంగారాన్ని దాచిపెట్టారు. కానీ, ఆ రైలును ఇప్పటికీ గుర్తించలేదు.
పోలాండ్, జర్మనీ, ఆస్ట్రియాకు చెందిన పరిశోధకులు, US సైన్యంతో కలిసి ఈ బంగారు రైలు కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. వాల్ బ్రజిచ్ బంగారు రైలు నైరుతి పోలాండ్ లోని ఒక పర్వతం కింద పూడ్చి పెట్టారని చాలా మంది భావిస్తారు. 2016లో, రైలును గుర్తించడానికి ఒక సొరంగంలో తవ్వకాలు కూడా ప్రారంభించబడ్డాయి. కానీ, ఆ తవ్వకాల్లో ఎలాంటి రైలు గుర్తించలేదు.
బంగారంతో నిండిన రైలు ఒక సొరంగం దగ్గరికి చేరుకుని, ఆ తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత, అది ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు. కొంత మంది దీనిని వివాదం చేస్తున్నారు. కానీ, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఇజ్రాయెల్ స్టడీస్ ప్రొఫెసర్ రోనాల్డ్ జ్వేగ్.. నాజీ సైన్యం ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని దోచుకుందని, దానిలో 70% తిరిగి పొందారని. మిగతాది ఇప్పటికీ గుర్తించలేదన్నారు.
1945లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నియంత హిట్లర్ కు చెందిన ఈ 150 మీటర్ల పొడవైన రైలు ప్రయాణిస్తూనే అదృశ్యమైంది. ఇతర దేశాల నుంచి దోచుకున్న 300 టన్నుల బంగారం దానిలో ఉంది. హిట్లర్ నాజీ సైన్యం ప్రజలను చంపడమే కాకుండా వారిని దోచుకుంది. విలువైన పెయింటింగ్‌లు, బంగారాన్ని దోచుకోవడం వారి వృత్తిగా మారింది. నాజీ సైన్యం మొత్తం బంగారు దోపిడీకి సంబంధించిన రికార్డులు లేవు. హిట్లర్ తాను దాడి చేసిన ప్రతి దేశం నుండి దోచుకున్న బంగారాన్ని జర్మనీకి పంపేవాడు. 1945లో యుద్ధంలో తాను ఓడిపోబోతున్నానని గ్రహించినప్పుడు, తన సైన్యాన్ని బంగారం, విలువైన వస్తువులను రైళ్లలో ఎక్కించి రహస్య ప్రదేశంలో దాచమని ఆదేశించాడు. ఆ తర్వాత ఈ రైలును ఎక్కడ దాచారనే ఇప్పటికీ తెలియదు.
300 టన్నుల బంగారంతో నిండిన రైలు కోసం ఇప్పటికీ చాలా మంది పరిశోధకులు వెతుకుతున్నారు. రైలులో కోట్ల రూపాయల విలువైన బంగారం ఉన్నందున ఇప్పటికీ అన్వేషణ కొనసాగుతోంది. కానీ, దాని జాడ మాత్రం ఎక్కడా లభించలేదు.
Read Also: ట్రాన్సపరెంట్ జీప్ చూశారా భయ్యా.. ఇంజిన్‌తో సహా అన్నీ బయటకే కనిపిస్తాయ్!