Ganja Seizure: స్వేచ్ఛ బ్యూరో: 64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి ని వైరా పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండితమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు,ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు మీడియాకు వైరా ఏసీపీ సారంగపాణి వివరాలు వెల్లడించారు. వైరా ఎస్‌ఐ రామారావు తన సిబ్బందితో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామం వద్ద అంజనేయస్వామి దేవాలయం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించేందుకు వెళ్తుండగా, రోడ్డుపక్కన ఐదు గోనె సంచులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు.
Also Read: నీటి కొరతకు బై-బై.. ఈ లైఫ్‌స్టైల్ మార్పులతో సమ్మర్‌లో నో టెన్షన్!
వారిని తనిఖీ చేయగా, ఐదు గోనె సంచులలో మొత్తం 60 ప్యాకెట్లలో సుమారు 64 లక్షల రూపాయల విలువ చేసే 128 కిలోల ఎండు గంజాయిని ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతం నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నిందితులు మనుయాల్ బోత్రా (22 )ఒడిశా, చిటికల సన్యాసినాయుడు (25 ) అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్, లక్ష్మణ్ కిలో (24 )ఒడిశాలను జుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.
Also read: కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి ఊడుతుందా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెనుక పెద్ద తలకాయలు?