BigTV English

Hezbollah’s big warning: హెజ్బొల్లా ‘సర్‌‌ప్రైజ్’ హెచ్చరిక.. త్వరలో మెరుపు దాడులు ?

Hezbollah’s big warning: హెజ్బొల్లా ‘సర్‌‌ప్రైజ్’ హెచ్చరిక.. త్వరలో మెరుపు దాడులు ?

Hezbollah’s big warning for Israel: గాజాలోని హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ముగింపు ప్రయత్నాలు కనిపించడం లేదు. అయితే.. ఈ క్రమంలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్ కు తాజాగా హెచ్చరికలు చేసింది. హమాస్ కు మద్దతుగా హెజ్బొల్లా దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే తమ నుంచి ఇజ్రాయెల్ సర్ ప్రైజ్ అందుకోబోతుందంటూ ఓ ప్రకటనను హెజ్ బొల్లా విడుదల చేసింది.


మరో విషయమేమంటే.. హెజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ కూడా ఇటీవల ఓ విడియోను విడుదల చేస్తూ ఇజ్రాయెల్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సాగిన ఈ పోరులో తాము ఏం సాధించలేకపోయామని స్వయంగా ఇజ్రాయెలే పేర్కొన్నదని ఆయన ఆ వీడియోలో చెప్పారు. అదేవిధంగా ఐరోపా దేశాలు ఇటీవల పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయిందన్నారు. కేవలం హమాస్ పోరాటం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. దాడులకు పాల్పడొద్దంటూ అంతర్జాతీయ కోర్టు ఆదేశించినా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రఫాలో దాడులకు పాల్పడుతుందంటూ ఆయన ఖండించిన విషయం తెలిసిందే.


అయితే, ఈ హెచ్చరికల నేపథ్యంలో బహుషా ఈ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడులకు దిగొచ్చు అనే టాక్ వినబడుతోంది. కాగా, హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలు కోరుకున్నప్పటికి కూడా ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది.

దక్షిణ గాజాలోని పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతుందంటూ దక్షిణాఫ్రికా ఫిర్యాదు చేయగా అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించి కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. రఫా పట్టణంపై వెంటనై సైనిక చర్యను నిలుపుదల చేయాలంటూ ఇజ్రాయెల్ ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. పాలస్తీనాలో రోజురోజుకు పరిస్థితులు క్షీణించిపోతున్నాయని, వాటిని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!

రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని న్యాయస్థానం ఆదేశించింది. మానవీయ కోణంతో ఈజిప్ట్-గాజా సరిహద్దును కూడా తెరవాలని, అదేవిధంగా దాని పురోగతిపై కూడా నెల రోజుల్లోగా ఓ నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. కాగా, అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన ఆదేశాలను నెన్యాహూ ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×