E-Paper
Advertisement

నాసిక్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం!

నాసిక్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం!
Advertisement

Nashik accident: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తీరని విషాదం నెలకొంది. శుభకార్యానికి వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని మృత్యువు కబళించింది. ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన బావిలోకి దూసుకెళ్లడంతో, అందులో ఉన్న వారందరూ జలసమాధి అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

శుభకార్యం ముగించుకుని వస్తుండగా విషాదం..
దిండోరి తాలూకాకు చెందిన దర్గోడే కుటుంబం శివాజీనగర్‌లోని ఒక బాంక్వెట్ హాల్‌లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం రాత్రి కార్యక్రమం ముగిసిన అనంతరం అందరూ కలిసి తమ మారుతి ఎక్స్‌ఎల్ కారులో ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావడం, అదుపు తప్పిన వేగమో లేదా మరేదైనా సాంకేతిక లోపమో తెలియదు కానీ, కారు ఒక్కసారిగా రహదారి పక్కన నీటితో నిండి ఉన్న బావిలోకి పడిపోయింది.

Advertisement

సవాలుగా మారిన సహాయక చర్యలు..
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ ముకేశ్ కాంబ్లే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ మధురే తమ బృందాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, బావి అంచు వరకు నీరు ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. చీకటిలో అగ్నిమాపక దళం, విపత్తు నిర్వహణ బృందాలు తీవ్రంగా శ్రమించి, రెండు భారీ క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి సమయంలో కారును వెలికితీశారు.

కలచివేస్తున్న దృశ్యం..
కారును బయటకు తీసినప్పుడు అందులో ఎనిమిది మృతదేహాలు లభ్యమవ్వగా, గల్లంతైన ఒక బాలిక కోసం గాలింపు చేపట్టారు. చివరకు ఆమె మృతదేహం కూడా లభించడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మృతుల్లో సునీల్ (32), రేష్మ (27), ఆశా (32), రాఖీ(10) అనిల్(13), శ్రావణి(11), శ్రేయాష్(11), సృష్టి(14), రాజేశ్(7)గా గుర్తించారు . కుటుంబం మొత్తం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

కేసు నమోదు.. దర్యాప్తు ప్రారంభం
ఈ దారుణ ఘటనపై దిండోరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారారా లేక ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఇలాంటి ప్రమాదాలు కుటుంబాలకు తీరని వేదనను మిగులుస్తున్నాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×