E-Paper
Advertisement

Yograj Singh: ధోని కాదు, వాళ్ల అయ్య వ‌చ్చినా CSK గెల‌వ‌దు

Yograj Singh: ధోని కాదు, వాళ్ల అయ్య వ‌చ్చినా CSK గెల‌వ‌దు
Advertisement

Yograj Singh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 256 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ ల‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంత జరుగుతున్న ధోనిని ఎందుకు ఆడించడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో అయినా మహేంద్రసింగ్ ధోనీని ఆడించాలని కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మహేంద్ర సింగ్ ధోని తిరిగి జట్టులో చేరినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను కాపాడడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. CSK పని అయిపోయిందని, ధోని ( MS Dhoni) కూడా ఏం పీకలేడని హాట్ కామెంట్స్ చేశారు యోగరాజ్ సింగ్.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

ధోని రీ-ఎంట్రీ ఇస్తే, చైన్నైని ఆప‌డం క‌ష్ట‌మేనా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెస్ట్ మూడ్ లో ఉన్నాడు. అతనికి గాయమైందని.. అందుకే మొదటి రెండు మ్యాచ్ ల‌కు దూరం కాబోతున్నట్లు ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది. ఇంతలోనే రెండు మ్యాచ్ ల్లో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. అయితే మహేంద్రసింగ్ ధోని లేకపోవడం వల్లనే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతుందని సోషల్ మీడియాలో అతనికి ఫ్యాన్స్ డబ్బా కొడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం బిగ్ ఫైట్ ఉంది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మహేంద్రసింగ్ ధోని ఆడతాడని ఒక అప్డేట్ మాత్రం వచ్చింది. ధోని వస్తే, కచ్చితంగా సండే సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు.

ధోని కాదు, వాళ్ల అయ్య వ‌చ్చినా CSK గెల‌వ‌దు

ధోని రీ-ఎంట్రీ ఇస్తే చెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుందనే నేప‌థ్యంలో యువరాజు తండ్రి యోగరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ కాదు భగవంతుడు దిగివచ్చినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవడం కష్టమేనని తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఔట్ డే టెడ్ అంటూ బాంబు పేల్చారు. ఈ సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగానే ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు. ధోని వస్తే ఏం చేస్తాడు.. అతని ఏజ్ కూడా అయిపోయింది కదా..? అంటూ ఫైర్ అయ్యారు 2025 సంవత్సరం ఐపీఎల్ సందర్భంగా ధోని ఉన్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయినట్లు గుర్తు చేశారు. అప్పుడు ఏం చేయలేని ధోని..ఈ ఏడాది సీజన్ లో ఆడతాడని నమ్మకం ఏంటి అంటూ యోగరాజ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో యోగరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం వేపుతున్నాయి. అయితే యోగరాజ్ సింగ్ చేసిన కామెంట్లకు మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ధోని అంటే ఇప్పుడు కూడా యోగరాజ్ సింగ్ కు అసూయ అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్.

Advertisement

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×