E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో రాత్రి దారుణం.. వేట కొడవళ్లతో దాడి, ఓ వ్యక్తి దారుణహత్య

Hyderabad Crime: హైదరాబాద్‌లో రాత్రి దారుణం.. వేట కొడవళ్లతో దాడి, ఓ వ్యక్తి దారుణహత్య
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వైన్ షాపు ఎదురుగా ఓ వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి వారంతా పరారయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని ఛత్రినాక చెందిన సతీష్ చౌలే గుర్తించారు పోలీసులు.

హైదరాబాద్‌లో దారుణం.. వేట కొడవళ్లతో దాడి

Advertisement

కారణాలు ఏంటో తెలీదుగానీ.. హైదరాబాద్ సిటీలో రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వైన్ షాప్ ముందు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు కొందరు వ్యక్తులు. ఆ సమయంలో దుండగులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నాడు.  ఆ ప్రాంతంలో వాహనం ఆధారంగా మృతుడ్ని గుర్తించారు. సతీష్ చౌలే వ్యక్తిగా గుర్తించారు. అతడు ఆ ప్రాంతానికి చెందినవాడు. ఘటన జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమీపంలోని వ్యక్తులు బాధితుడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

స్పాట్‌లో ఓ వ్యక్తి మృతి.. రంగంలోకి పోలీసులు

అప్పటికే మరణించినట్లు చెప్పారు ఉస్మానియా వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు ఛత్రినాక పోలీసులు. ఇంతకీ సతీష్ చౌలే హత్య వెనుక ఏం జరిగింది? ఎవరు అతడు? అనేదానిపై స్థానికుల నుంచి ఆరా తీశారు.

మరోవైపు సీసీటీవీ పుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో వాహనం కూడా ఉంది. అది ఎవరిది? మృతుడు వాహనంపై వస్తుండగా ఘటన జరిగిందా? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.  రాత్రి వేళ ఓ వ్యక్తి హత్యకు గురికావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:  యూపీలో ఘోరం.. లవర్‌ని చంపి, ముక్కలను తరలిస్తూ

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×