E-Paper
Advertisement

Fire accident in Secunderabad: సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇబ్బంది, ఏం జరిగింది?

Fire accident in Secunderabad:  సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..  అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇబ్బంది, ఏం జరిగింది?
Advertisement

Fire accident in Secunderabad: కారణాలు తెలీదుగానీ శీతాకాలంలో అగ్నిప్రమాదాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరగడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ ఏరియాలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదు, భారీగా ఆస్థి నష్టం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది?

Advertisement

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

Advertisement

కాలం ఏదైనా అగ్నిప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి.  ఒకప్పుడు సమ్మర్ సీజన్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరిగేవి.  ఇప్పుడు నగరాల్లో అలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం రాత్రి కూకట్‌పల్లి అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం వేకువజామున సికింద్రాబాద్ –రాణిగంజ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

అగ్ని నివారణ పరికరాలు నిల్వ ఉన్న గోడౌన్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. రెండుమూడు గంటలపాటు ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఆస్తినష్టం భారీగా ఉందని తెలుస్తోంది.

అదుపులోకి తెచ్చిన ఫైర్ ఇబ్బంది

గొడౌన్స్ ఉన్న కాంప్లెక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టు అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ లోని మూడు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం, సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు. తెల్లవారుజామున షాపులు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

లేకుంటే అస్సలు ఊహించలేమని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఘటన ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. వరుసగా హైదరాబాద్ సిటీలో అగ్నిప్రమాదాలు జరగడంతో నగరవాసులు హడలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

ALSO READ: వీధి కుక్కలపై విష ప్రయోగం.. 600 శునకాలు మృతి

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×