E-Paper
Advertisement

UP Crime: భార్య-ముగ్గురు పిల్లలను చంపి, యజమాని ఆత్మహత్య, యూపీలో దారుణం

UP Crime: భార్య-ముగ్గురు పిల్లలను చంపి, యజమాని ఆత్మహత్య, యూపీలో దారుణం
Advertisement

UP Crime: కారణాలు ఏమైనా కావచ్చు.. భార్య, ముగ్గురు పిల్లల్ని దారుణంగా చంపి ఆపై ఆత్మహత్య‌కు పాల్పడ్డాడు ఇంటి యజమాని. సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తర‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ ఫ్యామిలీ వెనుక అసలు ఏం జరిగింది? ఒకసారి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.

యూపీలో దారుణం.. ఐదుగురు సభ్యుల ఫ్యామిలీ ఆత్మహత్య

Advertisement

యూపీ కస్‌గంజ్ జిల్లా అమాన్‌పూర్ పట్టణంలో దారుణమైన ఘటన బయటపడింది.  ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. శనివారం సాయంత్రం వరకు ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. కిటికీ నుంచి కుటుంబసభ్యులంతా విగతజీవులుగా పడి ఉన్నారు. ఇంటి యజమాని సత్యదేవ్ ఫౌజీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.

అమాన్‌పూర్ పట్టణంలో స్థానిక పెట్రోల్ పంపు సమీపంలోని సత్యదేవ్-రామశ్రీ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. సత్యదేవ్ వెల్డింగ్ షాపు యజమాని. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ప్రాచి- 14 ఏళ్లు, ఆకాంక్ష-12, కుమారుడు గిరీష్- 10 ఏళ్లు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఐదుగురు సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

భార్య-ముగ్గురు పిల్లలను చంపి, ఆపై యజమాని ఆత్మహత్య

శనివారం సాయంత్రం సత్యదేవ్ ఫ్యామిలీ నుంచి ఓ ఒక్కరూ బయటకు రాలేదు. దీంతో అనుమానం రావడంతో ఇరుగుపొరుగువారు ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కిటికీలోంచి తొంగి చూశారు. ఒక్కసారిగా మృతదేహాలు కనిపించడంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సాయంత్రం 6 గంటలకు అక్కడికి వచ్చారు పోలీసులు. తలుపులు బలవంతంగా తొలగించి లోపలికి వెళ్లారు. గదిలో సత్యదేవ్ ఉరివేసుకుని ఉన్నాడు. ఆయన భార్య రామశ్రీ , ముగ్గురు పిల్లలు కింద విగత జీవులుగా కనిపించారు. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు.

ALSO READ: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

ఈ ఘటనపై కస్‌గంజ్ ఎస్పీ అంకితా శర్మ మాట్లాడారు. ఇంటికి రెండువైపులా తలుపులు లాక్ చేసి ఉన్నాయని తెలిపారు. సత్యదేవ్.. భార్య, పిల్లలను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. రామశ్రీ మెడపై గాయాలు ఉండగా, పిల్లల శరీరాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు.

వీరి గురించి చుట్టుపక్కల వాళ్ల నుంచి ఆధారాలు సేకరించారు పోలీసులు. మృతదేహాలు కనుగొనబడటానికి దాదాపు రెండు రోజుల ముందు ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఈ సంఘటన వెనుక గల ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×