Ganja Seized: ఒడిశా రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఇండ్లను అద్దెకు తీసుకుని గంజాయి దందా చేస్తున్న గ్యాంగులోని నలుగురిని ఎక్సయిజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 15లక్షల రూపాయల విలువ చేసే 30.15కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న మరో 8మంది కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రంప పంచాయతీకి చెందిన సంగీత్ సింగ్, హరికృష్ణ, సునీల్ సింగ్ తోపాటు మరికొందరు కొంతకాలం క్రితం నగరానికి వచ్చారు. ధూల్ పేట శివలాల్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ తరువాత ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తూ అమ్ముతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ఇంటిపై దాడి చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ధూల్ పేట ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: Jailer 2: రజనీ కాంత్ ‘జైలర్ 2’లో కామియో రోల్ చేయబోతున్న బాలీవుడ్ బడా స్టార్.. ఎవరంటే?