Sangareddy Crime News: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. మహళ ఒంటిరిగా కనిపిస్తేచాలు ఆమెని తమ వశం చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన మాధవన్ ఒకడు. భర్త ముందు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
దేవుడి మొక్కు తీర్చుకుని కాలి నడకన ఇంటికి తన భర్తతో ప్రయాణం అయ్యింది ఓ మహిళ. నడుస్తూ ఆలసిపోవడంతో మార్గమధ్యలో ఓ చెట్టు కింద భర్తతో కలిసి నిద్రపోతుంది. ఆ వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తను కొట్టి దుశ్చర్యకు తెగబడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలో శుక్రవారం రాత్రి ఈ దారుణమైన ఘటన జరిగింది.
సంగారెడ్డి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించారు. ఈ నెల రెండున తమ స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరడిగొండకు కాలినడకన వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించిన తర్వాత కాలినడకన ఇంటికి తిరిగి వస్తున్నారు ఆ దంపతులు.
శుక్రవారం రాత్రికి సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చేరుకున్నారు. ఫసల్‌వాదిలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో భోజనం చేసి పక్కనేవున్న ఓ చెట్టు కింద నిద్రపోయారు ఆ దంపతులు. నిర్మాణంలో ఉన్న విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు తమిళనాడుకు చెందిన 34 ఏళ్ల మాధవన్. ఆమెని ఎలాగైన తన వశం చేసుకోవాలని భావించాడు.
ALSO READ: యూపీలో దారుణం.. కోడలికి హెచ్ఐవీ సోకేలా అత్తమామల స్కెచ్
అర్ధరాత్రి సమయంలో భర్త కళ్ల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన భర్తను బండరాయితో గాయపరిచాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న మహిళ భర్త 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వివరాలు సేకరించిన తర్వాత నిందితుడు మాధవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.