E-Paper
Advertisement

Road Incident: మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై వ్యాన్‌ బీభత్సం.. కారు, ఆటో నుజ్జునుజ్జు

Road Incident: మహబూబ్‌నగర్ జిల్లాలో హైవేపై వ్యాన్‌ బీభత్సం.. కారు, ఆటో నుజ్జునుజ్జు
Advertisement

Road Incident: మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి జాతీయ రహదారి పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక డీసీఎం వాహనం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి పక్కనే ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ కారు, ఒక ఆటో రిక్షాపై బోల్తా పడింది.

అయితే, ఈ ప్రమాదంలో పెను విషాదం తప్పింది. డీసీఎం పక్కకు ఒరుగుతూ కారు వైపు దూసుకువస్తున్న ప్రమాదాన్ని పసిగట్టిన కారులోని నలుగురు ప్రయాణికులు.. క్షణాల వ్యవధిలోనే తలుపులు తెరుచుకొని చాకచక్యంగా బయటకు దూకేశారు. వారి సమయస్ఫూర్తి కారణంగా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు.

Advertisement

ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయి, గుర్తుపట్టలేని విధంగా మారింది. అలాగే, ఆటో రిక్షా కూడా దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఆటోలో కూడా పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, ఈ భయంకరమైన ఘటనతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు, ముఖ్యంగా అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అంతేకాకుండా వేసవి ఉదయం వేళ, ట్రాఫిక్ నిలిచిపోవడంతో గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే స్థానిక మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

Advertisement

Also Read: రెండో విడతలోనూ అదే రిపీట్.. పంచాయతీ పీఠంపై కాంగ్రెస్ జైత్రయాత్ర!

గాయాలు అయిన వారిని సమీప ఆసుపత్రికి తరలించిన అనంతరం, పోలీసులు క్రేన్ల సహాయంతో బోల్తా పడిన డీసీఎం వాహనాన్ని, దెబ్బతిన్న ఇతర వాహనాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత ట్రాఫిక్‌ నార్మల్ స్థితికి చేరుకుంది . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు డ్రైవర్ నిద్రమత్తులో అలా చేశాడా లేదా అధిక స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంగా విచారిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×