E-Paper
Advertisement

Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Mahabubabad Crime: ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు.. కోడలికి వేధింపులు పెట్టి, ఆ తర్వాత ఏం జరిగిందంటే
Advertisement

Mahabubabad Crime: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. అత్తింటి విషయాలు తెలియగానే  పుట్టింటివారు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత చేయాల్సినవన్నీ చేశారు. చివరకు కోడల్ని దారుణంగా చిత్రహింసలు పెట్టి చింపేసిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో వెలుగుచూసింది.

ప్రేమ పెళ్లిలో కట్నం చిచ్చు

Advertisement

మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెం తండాలో దారుణమైన ఘటన జరిగింది. పోలీసులు-మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. కొమ్ముగూడెం తండాకు చెందిన అర్జున్‌-కౌసల్య దంపతుల కూతురు స్వప్న. అదే గ్రామానికి చెందిన కిషన్-బుజ్జీల కొడుకు రామన్నతో లవ్‌లో పడింది. ఆ తర్వాత ఒకే గ్రామానికి చెందినవారు కావడం, పెద్దలను స్వప్న-రామన్నలు కన్వీన్స్ చేశారు.

ఇద్దరు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ సందర్భంగా మూడు లక్షల కట్నం అల్లుడికి ఇచ్చారు. ఇదంతా గతం మాట. వారికి పెళ్లయి దశాబ్దమున్నర కాలం గడిచింది. స్వప్న-రామన్న దంపతులు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. హాయిగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా భారీ కుదుపు మొదలైంది.

Advertisement

కోడలిపై వేధింపులు.. ఆ తర్వాత చంపేశారు?

అదనపు కట్నం కోసం స్వప్నపై వేధింపులు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన స్వప్ప తల్లిదండ్రులు.. ఎకరం భూమి అదనంగా ఇచ్చారు. అందుకు సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో ఓ పత్రం రాసి ఇచ్చారు. అయినా వేధింపులు ఏ మాత్రం తగ్గలేదు. ఇంటి విషయాలు బయటపెట్టి, కుటుంబ పరువును రోడ్డు మీదకు కోడలు ఈడ్చిదంతా నింధలు మోపారు భర్త రామన్న-అత్తమామలు.

తరచూ ఆమెని కొడుతూ ఇబ్బందులకు గురి చేసేవారు. మూడు రోజుల కిందట కోడల్ని రేకుల గదిలో బంధించారు. భర్త కుటుంబసభ్యులు నలుగురు కలిసి శనివారం రాత్రి స్వప్నను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. ఈ విషయం బయటవారికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు నటించారు. చివరకు స్వప్న మృత దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

ఈ విషయం తెలియగానే స్వప్న ఫ్యామిలీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. పురుగుల మందు కూతురు నోట్లో పోసి చంపేశారని ఆరోపించారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: ఇన్నోవా కారు-బైక్ ఢీ.. స్పాట్‌లో భార్యాభర్తలు

ఈ క్రమంలో రామన్న, వారి బంధువులు ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన రామన్నను స్థానికులు చావబాదారు. రామన్న తల్లిదండ్రులు-సోదరుడు పరారయ్యారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రామన్న ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తల్లిని కోల్పోయారు ముగ్గురు చిన్నారులు. పెద్ద కూతురు సంజన దివ్యాంగురాలు. చిన్న కూతురు దక్షిత, ఏడాది వయసు గల కొడుకు ఉన్నారు. అమ్మ ఏడ్చినా వదలకుండా కొట్టారని చిన్నారులు చెబుతున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×