E-Paper
Advertisement

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే

Congress: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా, రెండోవిడతలో అదే జోరు, కాకపోతే
Advertisement

Congress: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగాని కంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు.

పంచాయితీ ఎన్నికల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా

Advertisement

బీజేపీ మద్దతుదారులకు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 2,297 , బీఆర్ఎస్ 1,191 , బీజేపీ 257 , ఇతరులు 578 సర్పంచ్‌ స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఎం మద్దతుదారులు 33 చోట్ల, సీపీఐ బలపరిచినవారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,425 చోట్ల, బీఆర్ఎస్ 1,168, బీజేపీ 189, ఇతరులు 448 చోట్ల గెలుపొందారు.

రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదు

Advertisement

రెండో విడతలో కూడా ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ఉదయం నుంచే బారులు తీరారు. రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28 శాతం మంది ఓటేశారు. రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

మరోవైపు నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలిచింది. అటు నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు ,మెదక్, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేటలోనూ ఇదే కొనసాగింది.

Also Read:బీజేపీకి కొత్త బాస్ వచ్చేసినట్టేనా? నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం వెనుక?

గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో కూడా హస్తం పార్టీ హవా చూపించింది. సిద్దిపేట, కుమురంభీం, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్‌ దూసుకుపోయింది. ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులే అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించింది.

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×