Khopoli Incident: మహారాష్ట్రలోని పుణే జిల్లా ఖలాపూర్ వద్ద ముంబై-పుణే ఎక్స్‌ప్రేస్ హైవేపై.. శనివారం మధ్యాహ్నం 22 వాహనాలను కంటైనర్ ఒక్క సారిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒక మహిళ మరణించగా, 21 మంది గాయపడ్డారు. ధరశివ్ జిల్లా నివాసి అనితా ఎఖండే (58) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెలితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసలు నివాసి అయిన కంటైనర్ డ్రైవర్ రాజేష్‌కుమార్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయ్‌గడ్ జిల్లాలోని ఖోపోలి పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఖోపోలిలోని కొత్త సొరంగం సమీపంలో ముంబైకి వెళ్తున్న కంటైనర్.. బ్రేకులు ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయింది. దాంతో దారిలో ఉన్న వాహనాలను ఢీకొట్టిందని పోలీసుల విచారణలో తెలింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే, రాయ్‌గడ్ పోలీసు, హైవే సేఫ్టీ పెట్రోల్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను అక్కడి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంలో 22 వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటన కారణంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకుని.. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి, ట్రాపిక్ క్లియర్ చేయడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
Also Read: మానసా దేవి టెంపుల్‌లో తొక్కిసలాట.. ఒకేసారి వేలాది మంది.. స్పాట్‌లోనే..
ఖోపోలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సచిన్ హైరే మాట్లాడుతూ, కంటైనర్ ఢీకొన్న SUVలో తన కుటుంబంతో ముంబై వైపు వెళ్తున్న అనితా ఎఖండే ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. 21 మంది చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అతనికి బ్రీత్-ఎనలైజర్ పరీక్షలో అతను మద్యం సేవించి వాహనం నడపలేదని తేలిందని హైర్ అన్నారు.. అంతేకాకుండా కంటైనర్ బ్రేక్‌లు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలింది. అలాగే ప్రయాణికులు ఇలాంటి ఘటనలు రీపీట్ కాకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.