Haridwar Stampede: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. శ్రావణమాసంతో పాటు ఆదివారం కావడం సందర్భంగా మానసాదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో మెట్ల మార్గం వద్ద తొక్కిసలాటకు దారితీసింది.
తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి
ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద తొక్కిసలాట
గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. శ్రావణంలో హరిద్వార్‌లోని గంగా తీరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కన్వర్ యాత్రికులు సైతం గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడకు ఎక్కువగా వస్తారని తెలిపారు. తాను ప్రస్తుతం సంఘటన స్థలానికి వెళ్తున్నట్టు కూడా చెప్పారు.
Also Read: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. హరిద్వార్‌లో విషాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు అందించేందుకు స్పెషల్ రిలీఫ్ టీం అక్కడకి పంపినట్టు తెలిపారు. గాయపడిన భక్తులు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తున్నాను’ అని సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు.
ఆలయం వద్ద తొక్కిసలాట.. ఆరుగురు మృతి!
ఉత్తరాఖండ్-హరిద్వార్‌లోని మానస దేవి ఆలయంలో తీవ్ర విషాదం
శ్రావణమాసం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు
ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/WXrCgiYN5R
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2025