Hyderabad Crime news: సమస్య ఏంటో తెలీదుగానీ కారులోనే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా కారులో ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణంగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు పేరు ఉమాశ్రీ, సొంతూరు ముంగనూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అనంతరం మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సివుంది.
కారులో మహిళ ఆత్మహత్య..
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్న రామకృష్ణారెడ్డి, ఉమాశ్రీ దంపతులు
తమ కారులో కూర్చుని పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్న ఉమాశ్రీ
ఉమాశ్రీ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సోదరుడు pic.twitter.com/P9WDaT0G2J
— BIG TV Breaking News (@bigtvtelugu) December 19, 2024