Intinti Ramayanam Today Episode December 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి బాధపడటం చూసిన భానుమతి ఏమైందని అడుగుతుంది. ఆమె అత్తయ్య కు నిజం చెప్తుంది. రాజేంద్రప్రసాద్ సగమ ఆస్తిని అక్షయ పేరు మీద రాశాడని పార్వతి భానుమతితో అంటుంది. దానికి పార్వతి అక్షయ్ నా కొడుకు కాదని మీ కొడుకు నాకు ఈ రోజు గుర్తు చేశారు అత్తయ్య నాకు ఎంత బాధగా ఉంటుంది. ఇది రాసినందుకు నాకు బాధ లేదు తన తల్లి ఆస్తి అని నన్ను వేరు చేసి చూడడమే బాధగా ఉంది ఇన్ని రోజులు నేను ఏ రోజైనా అక్షయ్ ని నా కొడుకు కాదని అనుకున్నాను అని పార్వతి బాధపడుతుంది.. అప్పుడే రాజేంద్రప్రసాద్ అక్కడికి వస్తాడు. పార్వతి నువ్వు ఇక్కడ ఉన్నావా పద వెళ్దాం అనేసి అడుగుతాడు. దానికి భానుమతి రాజేంద్ర ప్రసాద్ ను నిలదీస్తుంది. అక్షయ పేరు మీద సగం ఆస్తి రాసావా చెప్పు రాజేంద్ర అని అడుగుతుంది. పార్వతీ మనసులో అవనిపై అనుమానం వచ్చేలా భానుమతి మాట్లాడుతుంది. మీ ఆయన ఆ అక్షయ్ పేరు మీద ఆస్తి రాయడానికి కారణం అవనినే అంటుంది. పార్వతి రావడం చూసి అక్క ఈ ఆస్తిని నాకు దక్కనివ్వవా అనేసి నాటకం మొదలు పెడుతుంది. ఈ ఆస్తిలోనికు చిల్లి గవ్వ కూడా రానివ్వను మొత్తం మా ఆయన చేతిలోనే ఉండేలా చేస్తాను అనేసి అవని అంటుంది. ఇక పార్వతి అవని మనసులో ఎంత ఉందా అనేసి ఆలోచనలో పడుతుంది. పార్వతి మెలకువగా ఉండి కూడా అవని పిలిచిన పలకదు. గాజులు ఇచ్చినందుకు కోపంగా ఉన్నట్టుంది అత్తయ్య అని మీకు చెప్పకుండా గాజులు ఇచ్చినందుకు నన్ను క్షమించండి అత్తయ్య అంటుంది. భానుమతి అక్కడికి వచ్చి పెళ్లయిన ఇన్నేళ్లలో నా కోడలు ఎప్పుడు ఇంత సేపు పడుకోవడం చూడలేదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుంటూ పోతుండు నోటికి వచ్చినట్లు తిడుతుంది. ఇక కమల్ రావడం చూసి భానుమతి నోరు మూసుకుంటుంది. ఇక అందరూ ఎవరి పాటికీ వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య అవని దగ్గరకొచ్చి మమ్మి నాకు రోజు గుడ్ మార్నింగ్ చిట్టితల్లి అని నానమ్మ లేపి మరి నాకు స్నానం చేయించేది కానీ ఈరోజు నానమ్మ నాకు విష్ చేయలేదు స్నానం చేయించలేదు. నేనే స్నానం చేశాను అనేసి అంటుంది. దానికి అవని వెరీ గుడ్ అని అంటుంది. నా మీద కోపం ఆరాధ్య మీద చూపిస్తున్నట్టుంది అందుకే ఆరాద్యను పట్టించుకోవట్లేదు అనేసి అనుకుంటుంది. నానమ్మకు ఆరోగ్యం బాగోలేదమ్మా అందుకే నిన్ను లేపలేదు అనేసి అవని చెప్తుంది. నీకు ఈరోజు నేను జడవేసి రెడీ చేస్తాను అంటే నానమ్మకి బాగలేదా అయితే నేను వెళ్లి చూసి వస్తాను అనేసి వెళ్తుంది. నీకు బాగలేదు అంట కదా అమ్మ చెప్పింది అనేసి అనగానే రోజు నాకు గుడ్ మార్నింగ్ చెప్తావు కానీ ఈరోజు చెప్పలేదు అనేసి అంటుంది. దానికి పార్వతి గుడ్ మార్నింగ్ చిట్టితల్లి అని అంటుంది. ఇక అవని ఆరోగ్యం నేను జడవేస్తాను రా అంటే లేదు నానమ్మ జడ వేస్తుంది నీ కన్నా బాగా నానమ్మ జడ వేస్తుంది అనేసి అవనితో అంటుంది.
అక్షయ్ స్నానం చేసి రెడీ అవుతూ ఉంటాడు.. అవని కాఫీ తీసుకొని వెళుతుంది కానీ అక్షయ్ నాకు వద్దు అనేసి అంటాడు. ఏమిచ్చినా నేను తీసుకోను నేను తినను తాగను అనేసి అంటాడు. ఈ కాఫీ నేనే తాగుతాననేసి అవని అంటుంది. కాఫీ తాగుతూ కాఫీ గురించి చెప్తూ అక్షయకు నోరు ఊరిస్తుంది. ఇక కూడా వేసుకొని అని చెప్తారేమో.. నేను ఉతికి ఐరన్ చేసి పెట్టినవి అనగానే అక్షయ్ బట్టలు కూడా వేసుకొని అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్షయ్ వాటిని చూసి నవ్వుతుంది. మీరు ఇచ్చిన డబ్బులతోనే తెచ్చిన సరుకులతోనే మీరు తినొచ్చు అనేసి అంటుంది. బట్టలు కూడా మీదే మీరు ఈ కలర్ షర్ట్ వేసుకోమని ఇస్తుంది. మమ్మీ తిన్నదా అనేసి అడుగుతాడు. లేదండి కాఫీ తీసుకెళ్లి ఇచ్చినా గాని వద్దని చెప్పింది అంటుంది. మమ్మీ కి నేనే తీసుకెళ్తాను నిన్నటి నుంచి ఏమీ తినలేదని అక్షయ్ టిఫిన్ తీసుకుని వెళ్తాడు. నా మీద ఏమైనా కోపం ఉందా తిట్టు కొట్టు కానీ నువ్వు ఇలా భోజనం మానేసి కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది నేను అవని తప్పు చేసి ఉంటే నువ్వు మమ్మల్ని అనే హక్కు ఉంది అంతేగాని తినకుండా మాత్రం ఉండద్దు అని అక్షయ్ అంటాడు..
నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు అక్షయ్. మనసులో ఏదో చిన్న బాధ అంతేకానీ ఎటువంటి కోపం లేదు నీ మీద అవని మీద కూడా లేదు అనేసి అంటుంది. నీకు ఈరోజు నా చేతులతోనే తినిపిస్తానని టిఫిన్ తినిపిస్తాడు. బయట నుంచి అవని రాజేంద్రప్రసాదులు చూస్తారు. ఈరోజు నేను ఎంత అదృష్టవంతుడినమ్మా నా చేతులతో నీకు తినిపించే అవకాశం వచ్చింది. నీకు ఎప్పుడు కోపం వచ్చినా భోజనం మీద మాత్రం చూపించదు అనేసి అక్షయ్ వెళ్లిపోతాడు. రాజేంద్రప్రసాద్ వచ్చి చూసావా పార్వతి అక్షయకు నువ్వంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమ నువ్వు ఎందుకు అతని దూరం పెట్టాలనుకుంటున్నావనేసి అంటాడు. ఆస్తి విషయంలో కాదండి అక్షయకి నేను కన్నతల్లి కాదు.. ఎక్కడ నాకు దూరం అయిపోతాడు అని బాధ నాకు గుండెల్లో తోలిచివేస్తుంది అనేసి అంటుంది. బామ్మ కొత్త ఫోన్ కొని ఉంటుంది. బామ్మ దగ్గరికి వెళ్లి ఫోన్ ఎవరిది అంటే నాదే నేనే కొనుక్కున్నాను అనేసి అంటుంది. తాతయ్య కూడా లేదు కదా నువ్వు గంటలు గంటలు ఎవరితో మాట్లాడతావు ఫోన్ కొని అని పల్లవి అడుగుతుంది. ఫోన్ లో వేరే వాళ్ళ బుర్రలు తినడానికి కాదని కొనింది కాసేపు గేమ్ ఆడుకోవడానికి నాకు కాలక్షేపంగా ఉంటుందని నా దగ్గర దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాను అనేసి చెప్తుంది.
ఈ ముసలి దానికి కొత్త ఫోనా ఎలాగైనా తీసుకోవాలని కమల్ ప్లాన్ వేస్తాడు. వదిన ఆరోగ్య కోసం చాక్లెట్లు స్వీట్స్ కబోర్డ్ లో పెట్టాను వచ్చిన తర్వాత ఇవ్వు అని గట్టిగా అరుస్తాడు. ఈ విన్న భానుమతి చాక్లెట్లు స్వీట్స్ అంట కబోర్డ్ లో ఉన్నాయంట అది తీసుకుందామని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. అక్కడ ఎంత వెతికినా ఏమి కనిపించవు. అప్పుడే కమల్ వచ్చి ఏమి పట్టలేదు నీ ఫోన్ తీసుకోవడానికి నేను ఈ ప్లాన్ వేసాను అని చెప్తాడు. ఆ ఫోన్ తీసుకెళ్లి నీళ్లలో వేస్తాను నువ్వు భోజనాన్ని అన్నందుకు గుంజులు తీ నేను వినలేదు అనుకున్నా కదా అనేసి అడుగుతాడు. భానుమతి గుంజలు తీస్తుంది. ఇక అక్షయ్ లోపలికి వెళ్లి గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. వాట్సాప్ లో బైక్ ఫోటోలు రావడం చూసి తన ఫ్రెండుకి కాల్ చేస్తాడు. నీ షో రూమ్ కి వచ్చిన కొత్త బైక్ ఆ అయితే తీసుకురా నేను కొనేస్తాను అనేసి అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి అవనిని అడ్డంగా ఇరికిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..