అందరికీ తెలిసిన విషయమే కానీ పాటించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అదే పాలల్లో పసుపు కలుపుకుని తాగడం. పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీన్ని పాటించే వారి సంఖ్య చాలా తక్కువ. మిగతా కాలాల్లో పాటించినా, పాటించకపోయినా చలికాలంలో మాత్రం కచ్చితంగా పాలల్లో పసుపు కలుపుకొని రాత్రి పడుకోబోయే ముందు తాగండి. ఈ నాలుగు నెలలు మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీకు రావు.
పసుపు పాలు ఉపయోగాలు
పురాతన కాలం నుండి పసుపు పాలను తాగటం అనేది మన సాంప్రదాయాల్లో ఒకటిగా మారిపోయింది. కానీ ఆధునిక ప్రపంచంలోని యువత ఈ పసుపు పాలను తాగేందుకు ఇష్టపడడం లేదు. ఒక కప్పు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగి చూడండి. కొన్ని రోజులకే మీరు కొత్త శక్తిని ఆరోగ్యాన్ని పొందుతారు. పసుపులో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. అవి పాలలో ఉండే కాల్షియంతో కలిసి మన శరీరాన్ని రక్షిస్తాయి.
శరీరాన్ని సేఫ్‌గా ఉంచుతుంది
పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చలికాలంలో మన శరీరాన్ని కాపాడతాయి. చలికాలంలో ఎక్కువమందికి కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే పసుపు పాలను తాగేందుకు ప్రయత్నించండి. చలికాలంలో జలుబు, దగ్గు, కఫంతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. వారు కూడా పసుపులో పాలు కలుపుకొని ప్రతిరోజూ రాత్రిపూట గోరువెచ్చగా తాగితే ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఒక యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకుంటే ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా అంతే శక్తిని శరీరం పొందుతుంది. ఈ పసుపు పాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని శరీరకణాలకు అందజేస్తాయి. కాబట్టి జ్వరం వంటివి రాకుండా ఉంటాయి.
⦿ చల్లబడిన వాతావరణంలో గుండె జబ్బులు త్వరగా వస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలి. వాటిల్లో ప్రధానమైనది పసుపు పాలు. వీటిలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు యాంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు గుండెకు రక్షణ వలయంలాగే ఏర్పడతాయి
⦿ మధుమేహంతో బాధపడేవారు చలికాలంలో ప్రతిరోజూ ఒక కప్పు పాలలో పసుపు కలుపుకొని తాగేందుకు ప్రయత్నించండి. మీ రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా స్థిరంగా ఉంటాయి. దీనివల్ల మీ శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పసుపులో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి నిద్రను ప్రేరేపిస్తాయి. నిద్రలేమి సమస్య అనేక రోగాలకు కారణం అవుతుంది. కాబట్టి పసుపు, పాలు తాగడం వల్ల మీరు నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
⦿ క్యాన్సర్ బారిన పడిన రోగులు కూడా ప్రతిరోజూ పసుపు పాలు తాగేందుకు ప్రయత్నించండి. పురాతన కాలంలో కూడా క్యాన్సర్ కు పసుపు పాలను చికిత్సగా అందించే వారిని చెప్పుకుంటారు. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ పేషెంట్లు త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.
Also Read: ఈ చలిని తట్టుకోవాలంటే.. మీరు తినే ఆహారంలో ఇది ఎక్కువ ఉండాలి
పిల్లల కోసం
పిల్లలకు పాలలో చిటికెడు పసుపు కలిపి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. క్యాల్షియం, విటమిన్ ఈ రెండూ కూడా పసుపు పాలలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పిల్లలకు తాగించడం వల్ల వారు మరింత దృఢంగా మారతారు. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న పెద్దవారు కచ్చితంగా పసుపు పాలు తాగేందుకు ప్రయత్నించండి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పాలు ఎంతో మేలు చేస్తాయి. ఒక నెల రోజులు పాటు ఈ పసుపు పాలను తాగి చూడండి. మీలో వచ్చే మంచి మార్పులను మీరే గుర్తిస్తారు.