E-Paper
Advertisement

Suryapet District: దారుణం.. ప్రేమించిన యువతి దూరం పెడుతోందని సుత్తితో యువకుడి దాడి, చివ‌రికి..

Suryapet District: దారుణం.. ప్రేమించిన యువతి దూరం పెడుతోందని సుత్తితో యువకుడి దాడి, చివ‌రికి..
Advertisement

Suryapet District: దారుణం.. ప్రేమించిన పాపానికి అనంత‌లోకాల‌కు పంపించాడు.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహనగర్‌లో ప్రేమ పేరుతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తాను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందన్న కక్షతో, ఆమె నివసిస్తున్న ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడ్డాడు. వెంట తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బలంగా బాదాడు. ఈ ఊహించని దాడితో ఆ యువతి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

యువతి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నిందితుడిని స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం, అతడిని సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు.

Advertisement

తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.

Also Read: డీమార్ట్ దారిలో డేంజర్.. గంజాయి మత్తులో రెచ్చిపోతున్న మైనర్లు.. సీన్ క‌ట్ చేస్తే!

Advertisement

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు గత కొంతకాలంగా యువతిని వేధిస్తున్నాడా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×