E-Paper
Advertisement

BRS Party: తెలంగాణలో గులాబీకి గడ్డుకాలం.. ఇకనైనా కేసీఆర్ బయటకొస్తారా?

BRS Party: తెలంగాణలో గులాబీకి గడ్డుకాలం.. ఇకనైనా కేసీఆర్ బయటకొస్తారా?

BRS Party: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ చలికిల పడింది. పార్టీని నడిపించే సరైన నాయకుడు లేడదనేది స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఏ ఎన్నికలు వచ్చినా గులాబీకి పరాభావం తప్పడం లేదు. కేవలం ఉత్తర తెలంగాణలోనే పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు వస్తున్నాయి. ఇద్దరు అగ్రనేతలు ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలను సాధించలేకపోయారు. ఇక్కడ పార్టీ అగ్రనేతలు ప్రచారం చేయడంతోనేనా అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే దక్షిణ తెలంగాణలో ఇద్దరు అగ్రనేతల్లో ఒకరు ప్రత్యేక దృష్టిసారిస్తే తప్ప పార్టీకి పునర్ వైభవం వచ్చేలా కనిపించడం లేదు. అయితే ఆదిశగా పార్టీ దృష్టిసారిస్తుందా? లేదా? అనేది పార్టీలోనే చర్చకు దారితీసింది.

మాజీ మంత్రులు కీ రోల్

బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణలో గడ్డుపరిస్థితి నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు ముగింట చతికిలపడుతుంది. తొలుత పోటీ ఇచ్చినట్లే ఇచ్చి చివరకు నిలబడలేకపోతుంది. అందుకు దక్షిణ తెలంగాణ జిల్లాలోని నేతలే కారణమని పార్టీలోనే ప్రచారం జరుగుతుంది. ఆపార్టీ నేతల వ్యవహారశైలీతోనే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది పార్టీనేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు గులాబీ అధికారంలో ఉన్న సమయంలో ఈ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు కీ రోల్ పోషించారు. వారే చెప్పిందే వేదం అన్నట్లు సాగింది. అయితే అప్పుడే కొంతమంది నేతల్లో ఆ నేతలపై అసంతృప్తి నెలకొంది. కొద్దిమందినే ప్రోత్సహించి మిగతావారిని విస్మరించడం, గ్రూపులకు తెరదీశారు. దీంతో ఉద్యమసమయంలో నుంచి పనిచేసినవారికి, పార్టీలో యాక్టీవ్ గా పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా కొంత దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీ గెలుపోటములపై ప్రభావం పడుతుంది. అంతేకాదు ఎన్నికల సమయంలోనూ మళ్లీ ఆ నేతలదే పెత్తనం సాగిస్తూ వారి అనుచరులకే ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగిస్తుండటం మరింత వ్యతిరేకతకు కారణం అవుతుంది. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పనిచేసేవారికి గుర్తింపు దక్కకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Also Read: Shadab Khan: పందుల్లాగా తిని, గ‌డ్డాలు పెంచేవాళ్ల‌కు ఏం తెలుసు..పాకిస్తాన్ మాజీల ప‌రువు తీసిన‌ షాదాబ్ ఖాన్

దక్షిణ తెలంగాణలో 5 మున్సిపాలిటీలే

దక్షిణ తెలంగాణ జిల్లాలు అయిన ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉంటే ఒక్కదాంట్లో విజయం సాధించలేకపోయింది. దీనికి కారణం గతంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలు అనుసరించిన విధానాలే కారణమనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి నల్లగొండలోనూ అదే పరిస్థితి నెలకొంది. 18మున్సిపాలిటీల్లో ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీల్లోనే విజయం సాధించింది. ఇది ఇప్పుడు చర్చకు దారితీసింది. మాజీ మంత్రి అన్నీ తానై వ్యవహరించినప్పటికీ ప్రభావం చూపకలేకపోయారు. ఆయన నియోజకవర్గ కేంద్రమైన సూర్యాపేట మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకోలేకపోయారు. దీనికి తోడు ఆయన అనుచరులకే మున్సిపల్ ఇన్ చార్జుల బాధ్యతలను అప్పగించడంతోనే ఓటమికి కారణమనే ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 22 మున్సిపాలిటీల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఐజ, ఆలంపూర్ మున్సిపాటీలు మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. ఈ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నా ప్రభావం చూపలేకపోయారు. ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీనియర్ మాజీ మంత్రి ఉన్నప్పటికీ ఎల్లంపేట, మూడుచింతపల్లిలో మాత్రమే విజయం సాధించడం ఇప్పుడు చర్చజరుగుతుంది.

పార్టీ పరువును నిలబెట్టిన ఉత్తర తెలంగాణ

గులాబీ పార్టీ పరువును ఉత్తర తెలంగాణ నిలబెట్టింది. 13 మున్సిపాలిటీల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. లేకుంటే కేడర్ మరింత నీరుగారిపోయేది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీల్లోనూ ఒక స్థానంలో మాత్రమే గెలిచారు. అదినూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మాత్రమే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 3 స్థానాల్లో విజయం సాధించింది. అది కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్లతో పాటు రాయికల్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నప్పటికీ 7 మున్సిపాలిటీల్లో ఒకే ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే విజయం సాధించారు. అది చేర్యాల మున్సిపాలిటీలో మాత్రమే. ఉమ్మడి మెదక్ లో ని 17 మున్సిపాలిటీల్లో 8 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మాత్రమే మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. గడ్డిపోతారం.. గుమ్మడిదల, ఇంద్రేశం, తూప్రాన్, జిన్నారం, ఇస్నాపూర్, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది.

కేటీఆర్ 3, హరీష్ రావు8

మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు సొంత ఉమ్మడి జిల్లాలకే పరిమితం అయ్యారు. అన్ని మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మిగతా జిల్లాల కంటే వీటిపైనే ఫోకస్ పెట్టారు. అయితే కేటీఆర్ ఉమ్మడికరీంనగర్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 3 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించగలిగారు. అదే హరీష్ రావు ప్రచారం చేసిన ఉమ్మడి మెదక్ లో 17 మున్సిపాలిటీల్లో 8 స్థానాల్లో విజయం సాధించారు. ఇది ఇప్పుడు పార్టీనేతలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చజరుగుతుంది. హరీష్ రావు ట్రబుల్ షూటర్ వ్యూహంతోనే పార్టీకి ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలు వచ్చాయని లేకుంటే రాజకీయాల్లో పరువు పోయేదనే ప్రచారం ఊపందుకుంది. అయితే మున్సిపాలిటీలు ఆశించిన స్థాయిలో రాని జిల్లాలపై ఫోకస్ పెడతారా? అక్కడి నాయకులతో పాటు పార్టీ సీనియర్లకు సైతం బాధ్యతలు అప్పగిస్తారా? లేకుంటే కేటీఆర్, హరీష్ రావులు ప్రచారం చేస్తారా? దక్షిణ తెలంగాణపై ఇద్దరిలో ఎవరు బాధ్యతలు తీసుకొని పార్టీని నడిపిస్తారనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. దిద్దుబాటు చర్యలు చేపడతారా? లేదా అనేది చూడాలి.

Also Read: Komatireddy Venkat Reddy: రెండేళ్లలో నల్గొండ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×