E-Paper
Advertisement

Hyderabad Crime: తాగుబోతు అని పెళ్లికి నో చెప్పడంతో.. కత్తితో గొంతు కోసి యువతిని దారుణంగా చంపాడు

Hyderabad Crime: తాగుబోతు అని పెళ్లికి నో చెప్పడంతో.. కత్తితో గొంతు కోసి యువతిని దారుణంగా చంపాడు
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణ హత్య చోటుచేసుకుంది. నగరంలోని ముషీరాబాద్, బాపూజీ నగర్‌లో 18 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థిని పవిత్ర దారుణ హత్యకు గురైంది. సమీప బంధువు ఉమాశంకర్ కత్తితో ఆమె గొంతు కోసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమ, పెళ్లి పేరుతో కొన్ని రోజులుగా ఉమాశంకర్ పవిత్రను వేధిస్తున్నాడు. అయితే, అతను తాగుబోతు కావటంతో పవిత్ర పెళ్లిని నిరాకరించింది. దీనితో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పవిత్ర తల్లిదండ్రులు ఆరోపించారు.

హత్యకు సంబంధించిన వివరాలను పవిత్ర మేనత్త వెల్లడించారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉమాశంకర్ వచ్చి, మాట్లాడుకుందామని చెప్పాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పవిత్ర మెడ, ఛాతీపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడని తెలిపారు. ఉమాశంకర్ తల్లిదండ్రులు చనిపోతే తమ అన్న, వదినే అతడిని చేరదీశారు. అయినా, విశ్వాసం లేకుండా ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఉమాశంకర్ తన కుటుంబంలోని ఎవరితోనూ పవిత్ర మాట్లాడకుండా అడ్డుకున్నాడు.

Advertisement

పెళ్లి కాకముందే ఇంతలా వేధిస్తున్నావు.. పెళ్లయితే ఇంకెలా ఉంటావని పవిత్ర ప్రశ్నించినందుకే ఆమెను చంపేశాడని మేనత్త వివరించారు. ఈ మేరకు వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ALSO READ: Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×