తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ వేదికగా సంస్థ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీలో వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ బాపూజీనగర్‌లో పవిత్ర అనే ఇంటర్ విద్యార్థినిని సమీప బంధువు ఉమాశంకర్ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ప్రేమ, పెళ్లి పేరుతో ఉమాశంకర్ వేధిస్తుండగా, అతను తాగుబోతు కావడంతో పవిత్ర పెళ్లికి నిరాకరించిందని తెలుస్తోంది.
కాళేశ్వరం నుంచి కార్ల స్కామ్ వరకు దోపిడీ చేశారు కాబట్టే ప్రజలు BRSకు బుద్ది చెప్పారని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఉద్యోగాలు, దళితులకే పట్టం కడతామని.. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే ప్రజలు అధికారం నుంచి తొలగించారని చెప్పారు.
ఏపీ వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాధి గడగడలాడిస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన 64 ఏళ్ల లూర్దమ్మ తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు రక్త పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలు బయటపడ్డాయి. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
కోనసీమ జిల్లా కొత్తపేటలో ఓ భూవివాదం పరిష్కరించాలని ఓ మహిళ మంత్రి సుభాష్ కాళ్లపై పడింది. నకిలీ పత్రాలు సృష్టించి తమ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని మంత్రి సుభాష్ ముందు బాధిత మహిళ గోడు వెల్లబోసుకుంది.
మేడారం సమ్మక్క, సారక్క ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గ్రానైట్‌తో గద్దెల విస్తరణ, ఆలయ ఆధునికీకరణ జరుగుతోంది. ఎనిమిది ద్వారాలు సహా నూతన నిర్మాణాలను మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆర్చ్‌లపై ఆదివాసీ సంస్కృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో కాంగ్రెస్ రెబెల్ సర్పంచ్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ ప్రచారాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇది ఝాన్సీ రెడ్డి స్వగ్రామం కావడంతోనే తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని రెబెల్ శ్రేణులు మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గంలో నియంతృత్వ పాలన నడుస్తోందని ఆరోపించారు.
కొమురం భీమ్ జిల్లా బెజ్జూర్ మండలంలో పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు పోలీసులు ప్రత్యేక బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కౌటాల సీఐ సంతోష్ కుమార్ సూచించారు. గొడవలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నాయకంపల్లిలో సర్పంచ్ అభ్యర్థితో సహా వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఆరు వార్డులు ఉండగా ఆ గూడెంలోని ప్రజలంతా కలసికట్టుగా అన్ని పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో అనుమానంతో ప్రియుడు నాగేష్ జోంద్లె అశ్వినిను ఆమె టీస్టాల్‌లోనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అశ్విని వేరే వ్యక్తితో సన్నిహితంగా చాట్ చేస్తుందనే అనుమానంతో అంబేడ్కర్ నగర్‌కు చెందిన నాగేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అశ్విని కేకలు విన్న స్థానికులు షట్టర్ తెరవలేక పోలీసులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కంసాన్‌పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో చిత్ర విచిత్రం చోటుచేసుకుంది. 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న సలీం ఓటును, అతనికి ప్రత్యర్థిగా నిలిచిన అంజాద్ అనే వ్యక్తి ఎన్నికల్లో అడ్డు తొలగించుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా మొగిలిగిద్ద గ్రామానికి బదిలీ చేయించాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన ఈ బదిలీపై సలీం ఆర్‌టీఐ ద్వారా సమాచారం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
కూకట్‌పల్లి వైజంక్షన్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలానగర్ ట్రాఫిక్ సీఐని జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ సీఐతో వాగ్వివాదానికి దిగారు. తమని అసభ్య పదజలంలో మాట్లాడారని కార్యకర్తలు ఆరోపించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రకటనలు చేతల్లో లేవని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. గత ఒప్పందాల్లో 10 శాతం పెట్టుబడులు కూడా రాలేదన్నారు. కేవలం భూముల కోసమే ఒప్పందాలు జరుగుతున్నాయని, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడు సుధీర్ బాబు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రులు నేరుగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే విచారణ కమిటీని వేశారు.
నంద్యాల జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ.. పగిడ్యాల–నందికొట్కూరు బీటీ రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో 4 కోట్లతో 10 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఫైబర్ టెక్నాలజీతో నిర్మించనున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ కార్గో ద్వారా మిర్యాలగూడ నుంచి అనధికారికంగా తరలిస్తున్న 60 బాక్సుల పురుగు మందులను అధికారులు పట్టుకున్నారు. సరైన పత్రాలు చూపించగలిగితే పురుగు మందులను వెనక్కి ఇస్తామని అధికారులు తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ప్రిటోరియా సమీపంలోని ఓ హాస్టల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.
జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు బ్రిటీష్ బానిస పాలనలో బతికాం.. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ పాలనలో బతికాం.. అదే 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రస్తుత కాలంలో పునర్వైభవం దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. దీంతో మోడీ వ్యాఖ్యలపై సభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తోన్న చిత్రం అఖండ2. ఆర్ధిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇష్యూ క్లియర్ అయిందని టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. డిసెంబర్ 12న అఖండ 2 విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
భారత బ్యాడ్మింటన్ లెజెండ్ సైనా నెహ్వాల్ లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా వేసిన స్టెప్‌ను అనుకరించారు. ఇటీవల ఆమె తన విహారయాత్రలో ఈ స్టెప్ వేశారు. ఈ వీడియోలో ఆమె తండ్రి కూడా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు. ఈ వీడియో క్లిప్‌ను సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.