E-Paper
Advertisement

Bengaluru Crime: సహజీవనంలో చిచ్చు.. ప్రియుడ్ని చంపిన నటి, బెంగుళూరులో దారుణం

Bengaluru Crime: సహజీవనంలో చిచ్చు.. ప్రియుడ్ని చంపిన నటి, బెంగుళూరులో దారుణం

Bengaluru Crime: సహజీవనం.. ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత విడిపోవడం జరుగుతుంది. ఇంకా ఆత్మహత్యలు లేకుంటే చంపుకోవడాలు అనే ట్రెండ్ కొనసాగుతోంది. కారణాలు ఏంటో తెలీదుగానీ ప్రియుడ్ని చంపిన ఓ నటి అడ్డంగా బుక్కయ్యింది. ఆమెతోపాటు సహకరించిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు బెంగుళూరు పోలీసులు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సహజీవనంలో చిచ్చు.. ప్రియుడ్ని చంపిన నటి

కర్ణాటకలోని హాసనకు చెందిన మోహన్‌‌కృష్ణ హత్య కేసులో ముగ్గురు అరెస్టయ్యాయి. వారిలో ఓ నటి కూడా ఉంది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. హాసన్‌కు మోహన్‌కృష్ణ-ఊర్వశి అలియాస్‌ బిందు ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు తమతమ  జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

బిందు పలు కన్నడ సినిమాలు భజరంగి, పోలీస్‌ క్వార్టర్స్, కాలభైరవ వంటి చిత్రాల్లో నటించింది. టీవీ సీరియల్స్‌లో నటించింది కూడా. టీవీ సీరియల్స్ డైరెక్టర్లకు సహాయకురాలిగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. మూడు నెలల కిందట తాము భార్యాభర్తలమని చెప్పి బాగలగుంటె విజయలక్ష్మి లేఅవుట్లో నటరాజ్‌ చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

బెంగుళూరులో దారుణం.. నటి అరెస్ట్

తాను పిగ్మి కలెక్టర్‌ అని ఊర్వశి సహ దర్శకురాలని ఇంటి యజమాని నటరాజ్‌కు చెప్పింది. దీంతో ఆయన అద్దెకు ఇవ్వడానికి ఓకే చేశారు. ఇల్లు మరీ చిన్నదిగా ఉండడంతో ఎదురుగా ఉండే ఇంట్లో మరొక గదిని రెంట్‌కు తీసుకుంది ఈ జంట. కొద్దిరోజులుగా బిందుకు ఇద్దరి వ్యక్తులతో కనిపించడం గమనించాడు మోహన‌కృష్ణ.

ఈ విషయమై బిందును పలుమార్లు ప్రశ్నించాడు. వారితో వివాహేతర సంబంధం ఉందని వేధించడం మొదలుపెట్టాడు. రెండురోజుల కిందట మద్యం పార్టీ తర్వాత లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసింది బిందు. ఈ ఘటన ఫిబ్రవరి 18న జరిగింది.  దాదాపు 10 రోజుల తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఇంటి ఓనర్ నటరాజ్‌ నాలుగు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ALSO READ: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. బీటెక్​ విద్యార్థినిపై అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

ఇంట్లో కుళ్లిన స్థితిలో మోహన్‌కృష్ణ మృతదేహం కనిపించింది. తొలుత బిందుని, ఆమె కాల్‌ రికార్డు ఆధారంగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. బిందు ప్రియుడు వినయ్‌కుమార్ గా గుర్తించారు. అతడి సహచరుడు ధనుష్ ట్రక్ డ్రైవర్.  ఈ కేసులో వారిని విచారిస్తున్నారు. వినయ్ తాను వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యామని, అందుకు మోహన్ వ్యతిరేకించడంతో హత్య చేసినట్టు బయటపెట్టారు.

వేసుకున్న ప్లాన్‌ ప్రకారం.. పార్టీ సమయంలో ఇంట్లో ఫుల్‌గా మద్యం సేవించాడు మోహన్ కృష్ణ. ఆ తర్వాత వినయ్, అతడి స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్‌పై దాడి చేశారు. కాళ్లు చేతులు కట్టేసి, మోహన్‌ని పలుమార్లు కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. ఊపిరి ఆడకపోవడంతో మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడి నుంచి వారంతా పరారయ్యారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×