AEE Nikesh Kumar Corruption Case: తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమ ఆస్తుల డొంక కదిపే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. సోదాల్లో కేవలం 100 కోట్ల విలువ చేసే ఆస్తులు పట్టుబడ్డాయి. తీగలాగితే డొంక ఇంకా కదులుతోంది. అంతర్గత సమాచారం మేరకు దాదాపు 500 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
వారం కిందట తెలంగాణ ఏసీబీకి భారీ తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈగా పని చేస్తున్న నిఖేష్ కుమార్ ఇంటిపై దాడులు చేసింది ఏసీబీ. ఆయనతోపాటు బంధువులు ఇళ్లలో సోదాలు చేసింది. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయట పడ్డాయి. ఈయన పేరు మీద కొన్నింటినే పెట్టుకున్నాడట. మిగతా ఆస్తులన్నీ బినామీ పేర్ల మీద ఉన్నాయట.
దీంతో ఆయనను కస్టడీకి తీసుకోవాలనే ఆలోచన చేశారు అధికారులు. ఆయన కస్టడీపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. వారం రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది ఏసీబీ. ఇప్పుడు బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు. ఆయన అక్రమాస్తులు విలువ దాదాపు 500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లు అన్నీ ఓపెన్ చేశారట. ఆయనతోపాటు బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఓవరాల్‌గా 18 లాకర్లు ఓపెన్ చేశారు. అందులో బంగారం, వెండి ఆభరణాలు మాత్రమే లభించాయి. ఆస్తులకు సంబంధించి కొన్ని పత్రాలు కూడా లభ్యమయ్యాయి. రోజురోజుకూ నిఖేష్ ఆస్తులు పెరగడంతో విచారణలోకి తీసుకోవాలని ఆలోచనకు వచ్చారు అధికారులు.
ఇప్పటికే నిఖేష్ కుమార్‌కి చెందిన ఐదు ఐఫోన్లను ల్యాబ్‌కు తరలించారు. అవి ఓపెన్ అయితే ఆస్తులు ఎంత అనేది కొలిక్కి రానుందని భావిస్తున్నారు. ఈలోగా కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ఆస్తులన్నీ కేవలం నిఖేష్‌కు సంబంధించినవా? లేక ఎవరైనా అధికారులవా? అనే దానిపై సస్పెన్షన్ నెలకొంది.
నిఖేష్‌కుమార్ ఇంటిపై సోదాలు చేసిన మరుసుటి ఆయన అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లెక్కన ఆస్తుల వెనుక మరెవరైనా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి నిఖేష్ అక్రమాస్తుల కేసులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.