Tarak Ponnappa.. సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరో, హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే వరుసగా రెండు మూడు సినిమాలలో నటించి, ఆ సినిమాలు హిట్ కొట్టాయి అంటే ఇక వారు ఆ హీరోలకి లక్కీగా మారిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే విలన్ గా ఈయన నటిస్తే చాలు సినిమా సూపర్ హిట్ అంటూ ఒక సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు తారక్ పొన్నప్ప (Tarak Ponnappa). ఈయన పేరు చెబితే తెలియకపోవచ్చు కానీ చూస్తే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.
పాన్ ఇండియా యాక్టర్ గా గుర్తింపు..
తారక్ పొన్నప్ప స్వతహాగా కన్నడ యాక్టర్ అయినా.. తెలుగులో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. గత కొన్ని ఏళ్లలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈయన అన్నీ కూడా సూపర్ హిట్ గానే నిలిచాయి. దీంతో పాన్ ఇండియా హీరోలకు లక్కీ విలన్ గా మారిపోయారు. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన తారక్ పొన్నప్ప కన్నడలో పలు రియాల్టీ షోలు చేస్తూ పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాతే పలు చిత్రాలలో అవకాశం లభించింది. ఇక ఎప్పుడైతే కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలలో నటించారు. దాంతో టాలీవుడ్ దర్శకుల దృష్టిలో కూడా పడిపోయారు.
పాన్ ఇండియా హీరోలకు లక్కీ చార్మ్..
ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ(Koratala Shiva)దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో విలన్ కొడుకుగా మంచి పాత్ర దక్కించుకొని, ఆ పాత్రతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా ‘బుగ్గారెడ్డి’ అనే పాత్రలో విలనిజం పండించి, తన అద్భుతమైన నటనతో మరొకసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇక్కడ విచిత్రం ఏమిటంటే కన్నడ సినిమాలు కాకుండా ఇప్పటివరకు నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తే, అవన్నీ కూడా సూపర్ హిట్ గానే నిలిచాయి. అందుకే ప్రాంతీయ భాషా సినిమాల కంటే పాన్ ఇండియా సినిమాలు ఈయనకు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా ఏ హీరో పాన్ ఇండియా చిత్రంలో నటించినా సరే అవి మంచి విజయం దక్కించుకుంటుండడంతో పాన్ ఇండియా మూవీలు చేసే హీరోలు కూడా తారక్ పొన్నప్ప ను తమ సినిమాలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం లక్కీ చార్మ్ గా మారిపోయిన ఈయన.. దక్షిణాది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద యాక్టర్ గా మారిపోయారు.
పుష్ప -2 సినిమాతో సరికొత్త రికార్డ్స్..
పుష్ప సినిమా విషయానికొస్తే.. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిపోయి, సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అటు హిందీలో కూడా బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి తెలుగు సినిమా సత్తా చాటడం అంటే నిజంగా ప్రశంసనీయం అని చెప్పవచ్చు. ఒక ప్రస్తుతం టికెట్ రేట్లు తగ్గడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.