E-Paper
Advertisement

మైనర్ బాలికపై అత్యాచారం.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
Advertisement

Alwal Case: స్వేచ్ఛ బ్యూరో: మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నేరస్తుడికి న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావడంతో 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు 5వేల జరిమాన విధించారు.

వివరాల్లోకి వెళ్లితే… అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే వీర వెంకట ప్రసాద్ ఆటో డ్రైవర్ (23)గా వృతి నిర్వహిస్తున్నాడు. అతడికి మైనర్ బాలికతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమె మాయమాటలతో లొంగదీసుకొని, నగరంలో నుంచి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. యాదగిరిగుట్ట తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు గత ఏడాది జనవరి 27న అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. సీఐ రాహుల్దేవ్ కేసు దర్యాప్తు చేయగా ఏసీపీ రాములు చార్జీషీటు దాఖలు చేశారు. కేసును పలుమార్లు న్యాయమూర్తి విచారించారు. చివరగా శుక్రవారం తుది విచారణకు వచ్చింది.

వీర ప్రసాద్ పై మోపిన అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి వెంకటేశ్ 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాలిలకు రూ. లక్ష పరిహార ఇవ్వాలని వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు పక్కాగా సాక్ష్యాదారులు సేకరించి, చార్జీషీటు దాఖల చేయగా, ఏపీపీ ప్రభాకర్ రెడ్డి నిందితుడి శిక్ష పడేలా వాదించారు. దీంతో అతి తక్కువ కాలంలో నిందితుడిపై మోపిన అభియోగం రుజువై, శిక్ష పడింది.

Advertisement

Also Read: క్రికెట్ పిచ్‌పై మల్లారెడ్డి మాస్ బ్యాటింగ్.. మేడ్చల్‌లో సీఎంఆర్ స్కూల్స్ షురూ!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×