E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం తనకు అమ్ముడుపోయిందన్న మాలిని    

Karthika Deepam 2 Serial Today Episode July 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం తనకు అమ్ముడుపోయిందన్న మాలిని    
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సుమిత్రను నిలదీసి మాట్లాడుతున్న మాలినితో నీకేం అర్హత ఉందని సుమిత్రమ్మతో మాట్లాడుతున్నారు అంటూ దీప ప్రశ్నిస్తే అయితే నీకేం అర్హత ఉందని సుమిత్ర తరపును వకాల్తా పుచ్చుకుంటున్నావని మాలిని అడిగితే సుమిత్రమ్మ మా అమ్మ అంటూ దీప చెప్తుంది. ఆ మాటకు అందరూ షాక్‌ అవుతారు. మాలిని ఆశ్చర్యంగా సుమిత్ర మీ అమ్మా అంటూ ప్రశ్నిస్తే.. ఈ ఇంటి అడపడుచు కోడలికి ఈ ఇంటి కోడలు వరుసకి అమ్మే అవుతుంది. ఆవిడను నేను అమ్మలాగే చూస్తాను. ఆవిడను ఎవరైనా ఒక్క మాటంటే అడ్డుపడతాను. ఈ దక్షిణమూర్తి తాతగారు కూతురు బతికి ఉండగానే.. పిండం పెట్టారు అప్పుడేమైంది ఈ బంధం. మేనకోడలి మనసు గురించి ఆలోచించే మీకు ఆడపడచు మనసు అర్థం కాలేదా..? మామయ్య గారు.. మా ఆడపడచుకు పిండం పెట్టొద్దని ఎందుకు అడ్డుపడలేదు.. కూతురుకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయకపోతనే మీరు చేతకానీ తల్లిదండ్రులు అని వీళ్లను నిందించారే.. బతికి ఉన్న ఆడపడచుకు మామగారు పిండం పెడుతుంటూ చూస్తూ నిలబడిన మీరు చేతకాని వాళ్లు కాదా…? మీ చేతల గురించి ఎవ్వరికీ తెలియదు అనుకున్నారా..? అనగానే..

మాలిని అది మా సొంత విషయం దాన్ని అడగడానికి నువ్వు సరిపోవు.. అనగానే.. ఇది వీళ్ల సొంత విషయం ప్రశ్నించడానికి మీరు సరిపోరు.. అనగానే.. దశరథ శభాష్‌ దీప నా మనసులో మాట చెప్పావు అంటాడు. మాలిని అన్నయ్యా.. అనగానే.. ఏంటి అన్నయ్యా నా చెల్లెలి కోడలు చెప్పిందంటే నేను చెప్పినట్టే నా కూతురు పెళ్లి ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎవరితో చేయాలో నాకు తెలుసు.. అనగానే.. కానీ దాని మనసులో ఆ పాత ప్రేమ ఇంకా ఉందన్న విషయం నీకు తెలియదు అంటుంది మాలిని. అందుకు కార్తీక్‌ అడ్డుపడి తాను దీప మెడలో తాళి కట్టడం అనేది నా తలరాత. అదే జరిగింది. తనకు ఎవరితోనో రాసి పెట్టి ఉంటుంది. వాళ్లతోనే అవుతుంది. జ్యోత్స్న చేయి అందుకునే వాడు వీళ్లకన్నా ప్రేమను పంచాలని అనుకుంటారు కదా..? జ్యోత్స్న తల రాత ఎలా ఉందో అంటూ చెప్పగానే.. దక్షిణమూర్తి కోపంగా ఇక్కడ మీ తలరాతలు అన్నీ మీ తాత మారుస్తాడురా అనగానే.. శివనారాయణ కోపంగా తిడతాడు. జ్యోత్స్న కూడా నా విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు అంటూ ప్రశ్నిస్తుంది.

Advertisement

సూరజ్‌ కూడా కలగజేసుకుని దక్షిణమూర్తిని తిడుతుంటే అది చెప్పడానికి నువ్వెవడివిరా అంటూ దక్షిణమూర్తి కోపంగా ప్రశ్నిస్తాడు. ఎవరో అయితేనే మాట్లాడాలా..? అంటూ సూరజ్‌ ప్రశ్నిస్తే.. అవును మేము మేము ఎప్పటికైనా కలుస్తాం.. మధ్యలో నువ్వెవరు అంటూ మాలిని అంటుంది. దీంతో శివనారాయణ కోపంగా సూరజ్‌ పరాయివాడు కాదు అంటూ శివనారాయణ అసలు మా ఇంట్లో విషయాలు నీకెలా తెలుస్తున్నాయి.. ఓ మనుషులను కొనడం నీకు అలవాటు కదా..? ఈసారి ఎవరిని కొన్నావో తెలుసుకోవచ్చా..? అనగానే.. నువ్వు తెలుసుకోలేవు బాబాయ్‌ అని మాలిని చెప్తే.. అదేం పెద్ద విషయం కాదు తెలుసుకోవచ్చు.. అంటాడు సూరజ్‌.. ఎలా తెలుసుకుంటావురా అని మాలిని అడిగితే.. తెలుసు.. మీ చేతికి ఉన్న ఉంగరం ఈ ఇంట్లో ఎవరికి ఉందో వాళ్లే మీకు అమ్ముడుపోయినట్టు అంటూ చెప్పగానే పారిజాతం, జ్యో షాక్‌ అవుతారు. వెంటనే దశరథ ఉంగరమా..? అని అడగ్గానే..

అవును సార్‌ ఆ ఉంగరం పారిజాతం గారి వేలికి ఉంది. ఆదే ఉంగరం చూపించి మాలిని గారు నన్ను కొనాలని చూశారు అంటూ సూరజ్‌ చెప్పగానే.. జ్యో భయంతో వీడు గ్రాణి గురించి తెలుసుకున్నాడంటే నా గురించి కూడా తెలిసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో సూరజ్‌ తాను అక్కడ ఉండటం మంచిది కాదని వెళ్లిపోతాడు. దక్షిణమూర్తి జ్యోత్స్న పెళ్లి గురించి అడిగితే దీప సమాధానం ఇస్తుంది. త్వరలోనే పెళ్లి చేస్తాం.. మిమ్మల్ని కూడా పెళ్లికి మొదటి శుభలేఖతో ఆహ్వానిస్తాం ఇక వెళ్లండి అని చెప్పగానే.. మాలిని తనకు అన్ని విషయాలు చెప్పిన పారిజాతాన్ని ఏమీ అనోద్దని చెప్తుంది. శివనారాయణ కోపంతో రగిలిపోతుంటాడు. పారిజాతం భయంతో అక్కడి నుంచి జారుకుంటుంది.

Advertisement

పారిజాతం వెళ్లి స్టోర్‌ రూంలో దాక్కుంటుంది. కార్తీక్‌ వెళ్లి పారిజాతాన్ని పిలుస్తాడు. శివనారాయణ వచ్చి కోపంగా పిలుస్తాడు. పారు భయంగా కూర్చుని ఉంటుంది. శివనారాయణ కోపంగా నువ్వు బయటకు వస్తావా..? మమ్మల్ని లోపలికి రమ్మంటావా..? అనగానే. .పారిజాతం డోర్‌ ఓపెన్‌ చేసుకుని బయటకు వస్తుంది. అందరూ తలో మాట తిడితే.. అన్ని ఆలోచించే ఈ పని చేశానని శివనారాయణ కోసమే ఈ పని చేశానని చెప్తుంది. ఎందుకని అడిగితే.. మాలిని ప్లాన్‌ గురించి తెలుసుకోవడానికే ఇలా చేశానని చెప్తుంది పారిజాతం. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

Big Stories

Advertisement
×