E-Paper
Advertisement

Road Accident: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

Road Accident: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
Advertisement

Road Accident: అనకాపల్లి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి ఎన్ఏడీ జంక్షన్‌కు చెందిన బి. సునీత.. ఈరోజు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ఉండటంతో తండ్రి ఆటోలో తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరింది.

Advertisement

అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్‌కు చేరుకున్న సమయంలో.. ఆటో ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది.   ఆటోలో కూర్చున్న సునీత వాహనం నుంచి రోడ్డుపైకి జారిపడింది. దురదృష్టవశాత్తూ, బోల్తా పడుతున్న ఆటో ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కన్న కూతురు తండ్రి కళ్ళముందే చనిపోవడంతో ఈ ఘటన అక్కడ ఉన్న అందర్నీ కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న సునీత తండ్రి లక్ష్మణరావు మాత్రం స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కుమార్తెను కాపాడుకోలేకపోయానని ఆవేదనతో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. కూతురు మృతదేహాన్ని మరో వాహనంలో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Also Read: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. భార్యను చంపి స్టేటస్ పెట్టిన భర్త..

ఈ ఘటనపై బంధువులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో అదుపు తప్పడానికి గల కారణాలు, వాహన పరిస్థితి, వేగం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×