Gold Rate Dropped: ఇది కదా కావాల్సింది. బంగారం ఇంతలా పెరిగిపోయింది ఏంటా అని బాధపడుతుంటే.. బంగారం రేట్లు తగ్గి పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చింది. వారం రోజులు ఇలా బంగారం రేట్లు తగ్గితే చాలు ఇంకా మళ్లీ బంగారు ప్రియులు వచ్చి దుకాణాల్లోనే ఉంటారు. ఇన్ని రోజులు రోజూ పెరుగుతూ.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గితే ఆ ఆనందమే వేరు.. అయితే ఈ రోజూ పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
గురువారం బంగారం ధరలు..
అయితే బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,370 కాగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,440 వద్ద పలుకుతోంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,05,750 ఉండగా.. గురువారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,900 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.930 తగ్గిందని చెప్పవచ్చు.
పండుగల వేల తగ్గుతున్న బంగారం ధరలు..
బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులు చాలా సంతోషిస్తున్నారు. పండుగల వేల బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు మళ్లీ బంగారం పై మోగ్గు చూపుతున్నారు. కానీ బంగారం ధరలు ఇలాగే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా..? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైతేనేం ప్రస్తుతం బంగారం ధర తగ్గడం చాలా ఆనందకర విషయం అని చెప్పవచ్చు..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,14,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,900 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,900 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,04,900 వద్ద కొనసాగుతుంది.
Also Read: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,590 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,05,500 వద్ద పలుకుతోంది.