E-Paper
Advertisement

Sarpanch Candidate: ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్ధి మృతి

Sarpanch Candidate: ఎన్నికల ప్రచారంలో ఒత్తిడి.. సర్పంచ్ అభ్యర్ధి మృతి
Advertisement

Sarpanch Candidate: నేలకొండపల్లి మండలం అనాసాగర్ సర్పంచి అభ్యర్ధి మృతి చెందారు. ఇక్కడి సర్పంచ్ స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, నామినేషన్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇంటింటి ప్రచారం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడటం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ క్రమంలో దామాల నాగరాజు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అలసట, ఒత్తిడితో శరీరం సహకరించకపోవడంతో శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులు, అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున నాగరాజు మృతి చెందారు.

Advertisement

ఈ వార్త వెలుగులోకి రావడంతో అనాసాగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న అభ్యర్థి అకస్మాత్తుగా మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదిలా ఉంటే..  మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న రోజే ఓ సర్పంచ్ అభ్యర్థికి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెెందారు.

Advertisement

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా తాండూరు మేజర్ పంచాయతీ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామి పోలింగ్ రోజున ఉదయం నుంచి ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించడం, తన మద్దతుదారులతో మాట్లాడటం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం సమయంలో వెంకటస్వామికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. మొదట స్వల్ప అసౌకర్యంగా భావించినప్పటికీ, కొద్ది సేపటికే పరిస్థితి మరింత విషమించింది. వెంటనే అక్కడున్న అనుచరులు, కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో వైద్యులు పరిశీలించిన అనంతరం వెంకటస్వామికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Also Read: పోలింగ్‌లో రిగ్గింగ్! ధర్మారంలో హై టెన్షన్

ఈ ఘటనతో తాండూరు మేజర్ పంచాయతీలో పోలింగ్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ఉత్సాహం మధ్యలో ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. వెంకటస్వామి అనుచరులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×