E-Paper
Advertisement

Singer Smitha : సింగర్ స్మిత వరల్డ్ టూర్… ఇన్ని రోజులూ ఏమైపోయావ్ పాపా ?

Singer Smitha : సింగర్ స్మిత వరల్డ్ టూర్… ఇన్ని రోజులూ ఏమైపోయావ్ పాపా ?
Advertisement

Singer Smitha ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పాప్ కల్చర్ ను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసింది సింగర్ స్మిత. ఒకప్పుడు తన పాటలతో ఆడియన్స్ ను ఊపేసిన ఆవిడ, గత కొన్నాళ్ళుగా కన్పించడం మానేసింది. కానీ తాజాగా సడన్ గ్ ఆ ఎంట్రీ ఇచ్చి, మళ్ళీ పాడబోతున్నట్టు వెల్లడించి షాక్ ఇచ్చింది. మరి ఇన్నాళ్ళూ ఆ అమ్మడు ఏమైపోయింది? ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

బిగ్ బాస్ వేదికపై అనౌన్స్మెంట్

గాయ‌ని స్మిత పాప్ సాంగ్స్ కేవ‌లం వెస్ట్ర‌న్ స్టైల్ కే పరిమితం కాలేదు. వెస్ట్రన్ ను ఇండో టచ్ ఇచ్చి ఇండో వెస్ట్రన్ స్టైల్ లో ఇండియాలోని ప్రతీ మూలా ఆమె పాటలు మారుమ్రోగేలా చేసింది. ముఖ్యంగా 20 ఏళ్ల క్రితం ఆమె రీమిక్స్ చేసిన సాంగ్ `మ‌స‌క మ‌స‌క చీక‌టిలో` ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సాంగ్స్ లిస్ట్ లో ఆ పాట ఉంటుంది. కాగా చాలా కాలంగా పాటలకు దూరంగా ఉంటున్న ఆవిడ తాజాగా బిగ్ బాస్ 9 వేదికపై మెరిసి షాక్ ఇచ్చింది.

ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ ఆల్ ఆఫ్ వరల్డ్

Advertisement

“మసక మసక చీకటిలో సూప‌ర్ హిట్ సాంగ్ కు అప్‌డేటెడ్ వెర్ష‌న్ ని తీసుకు వ‌స్తున్నాం” అంటూ స్మిత తన అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు ఈ సాంగ్ ను బిగ్ బాస్ వేదిక‌గా నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ పాట‌కు విజ‌య్ బిన్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, నోయ‌ల్ ర్యాప్ అందించారు. అంతేకాదు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్, సింగర్ నోయెల్ స్మితతో కలిసి ఈ ఆల్బమ్ కు డ్యాన్స్ కూడా చేసారు. గత కొన్నాళ్ళుగా ఇలాంటి స్టేజ్ కోసమే కావాలని బ్రేక్ తీసుకున్నాను అని, ఇకపై రెగ్యులర్ గా సాంగ్స్ ను రిలీజ్ చేస్తానని స్మిత ప్రకటించింది. అంతేకాకుండా తన సూపర్ హిట్ సాంగ్స్ తో వరల్డ్ టూర్ ప్లాన్ చేశానని ఈ సందర్భంగా వెల్లడించింది. ఆ వరల్డ్ టూర్ కు “ఓజీ క్వీన్ ఆఫ్ పాప్ ఆల్ ఆఫ్ వరల్డ్” అనే పేరు కూడా పెట్టింది. అంటే ఇప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా స్మిత పాటలు మారుమ్రోగబోతున్నాయి అన్నమాట.

ఇక స్మిత గాయని మాత్రమే కాదు నటి, బిజినెస్ వుమెన్ కూడా. మ‌ల్లీశ్వ‌రి, కింగ్ వంటి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది. తరువాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి, సింగర్ గా కొనసాగుతున్నారు. స్మితకు ఒక కుమార్తె ఉన్నారు. మరి ఇంత గ్యాప్ తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చిన స్మిత… సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడియన్స్ ను తన పాటలతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Read Also : సుమన్ శెట్టి ఎలిమినేషన్… బిగ్ బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×