AP Crime News: తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అంతు చూశాడు ఆ బాలిక తండ్రి. అందుకు ఆ వ్యక్తి ఏకంగా కువైట్ నుండి వచ్చి మరీ, అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి రాగా సంచలనంగా మారింది. తాను చేసింది న్యాయమంటూ సదరు తండ్రి కువైట్ కు వెళ్లి మరీ వీడియో రిలీజ్ చేయడం విశేషం. అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేట గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఓ వృద్దుడు హత్యకు గురైన ఆనవాళ్ళతో మృతి చెందాడు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ తరుణంలో హత్యకు పాల్పడ్డ నిందితుడు అసలు విషయం చెబుతూ.. వీడియో రిలీజ్ చేయడం విశేషం.
కొత్త మంగంపేటకు చెందిన ఆంజనేయ ప్రసాద్ ఉపాధి నిమిత్తం కువైట్ కు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన కుమార్తెను గ్రామంలో ఉంటున్న చెల్లెలు లక్ష్మీ, వెంకటరమణ దంపతుల వద్ద వదిలిపెట్టి వారు కువైట్ కి వెళ్లారు. తన కుమార్తెను పోషిస్తున్నందుకు ఆంజనేయ ప్రసాద్, తగిన డబ్బులు సైతం ఈ దంపతులకు పంపించేవాడు. ఒకరోజు వెంకటరమణ తండ్రి ఆంజనేయులు వరుసకు మనవరాలయ్యే ప్రసాద్ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని లక్ష్మీ, వెంకటరమణ దంపతులకు ప్రసాద్ కుమార్తె తెలిపింది. వారు ఆ బాలికను వారించి, మీ అమ్మాయిని మీరు తీసుకు వెళ్ళండి అంటూ ఆంజనేయ ప్రసాద్ కు సమాచారం అందించారు.
చేసేదేమీ లేక ఆంజనేయ ప్రసాద్ తన సతీమణిని ఇండియాకు పంపించి కుమార్తెను పిలుచుకు రావాలని పంపించాడు. ఆ సమయంలోనే ఆంజనేయులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తన తల్లికి చెప్పింది. అంతటితో ఆమె అసలు విషయాన్ని పోలీసులకు తెలిపింది. అప్పుడు పోలీసులు సరైన యాక్షన్ తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయ ప్రసాద్ కువైట్ నుండి స్వగ్రామానికి వచ్చి ఆంజనేయులును హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన ఆంజనేయులు దివ్యాంగుడు కావడం గమనార్హం.
Also Read: Child danger Viral video : సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో తల్లి.. ప్రమాదం అంచున పాప
తన కుమార్తెను వేధించారన్న ఉద్దేశంతో కువైట్ నుండి వచ్చి ప్రసాద్ హత్య చేయడంతో పాటు, మరలా కువైట్ కి వెళ్లి వీడియో విడుదల చేయడం సంచలనగా మారింది. అయితే తన బిడ్డకు జరిగిన అన్యాయానికి తండ్రి సరైన తీర్పు ఇచ్చినట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్నా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తగదని ఆంజనేయ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఉంటే, సరైన న్యాయం జరిగేదని ఇలా చేయడం తప్పని మరికొందరు వాదిస్తున్నారు.
సంచలనం… కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి చంపేశాడు!
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన
గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్య
అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు
తన కూతురి పట్ల అసభ్యకరంగా… pic.twitter.com/XWg5rrwYiF
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024
కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని.. కువైట్ నుంచి వచ్చి చంపేశాడు!
తన కూతురు ఏం చెప్పిందో వినండి అంటూ మరో వీడియో విడుదల #AndhraPradesh #Crime #Murder #bigtv https://t.co/tFFLX6Bf3M pic.twitter.com/SDuJ2ATt12
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024