BigTV English

Child danger Viral video : సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో తల్లి.. ప్రమాదం అంచున పాప

Child danger Viral video : సోషల్ మీడియా రీల్స్ పిచ్చిలో తల్లి.. ప్రమాదం అంచున పాప

Child danger Viral video | ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా మాయలో పడింది. ప్రజలందరూ ముఖ్యమైన పనులు పక్కన బెట్టి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు చిత్ర విచిత్రంగా రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అయిపోగానే తాము ఫేమస్ అయిపోతామని.. సోషల్ మీడియా ద్వారా బాగా డబ్బు సంపాదించేద్దామని కలలు కంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు ఒక రకంగా వ్యసనంగా మారిపోయాయి. వీటిని నిపుణులు ‘డిజిటల్ డ్రగ్స్’ గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియోలు చేసే వారు జీవితంలో ఇతర ముఖ్యమైన పనులన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రీల్స్ పిచ్చిలో మానవ సంబంధాలు బలహీనమై పోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాము చేసే వీడియోలకు ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్ వస్తున్నాయనే ధ్యాశలోనే జీవిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతన్న ఒక వీడియోలో ఒక యువతి తన ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా వీడియో చేసే పనిలో పడింది. వారు ప్రమాదంతో ఉన్నారనే ధ్యాస కూడా ఆమెకు లేదు.


వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి తన సోషల్ మీడియా అకౌంట్ కోసం వీడియో చేసే పనిలో బిజీగా ఉంది. ఆ ప్రాంతం ఒక హైవే పక్కనే ఢాబా లాగా కనిపిస్తోంది. ఆమె హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల వేషాధారణలో కనిపిస్తోంది. అయితే వీడియోలో ట్రాఫిక్ గా ఉన్న రోడ్డు పక్కనే నిలబడి డాన్సులు చేస్తూ కనిపిస్తోంది. ఇంగ్లీష్ పాట ‘మాడ్రన్ టాకింగ్స్ బ్రదర్ లూయి’ కు ఆమె డాన్స్ వేసింది.

పాప ప్రమాదంలో ఉందని పిల్లాడు హెచ్చరిస్తున్నా
ఒకవైపు యువతి డాన్సులు చేసుకుంటుంటే ఆమె ఇద్దరు పిల్లలు.. ఒక మూడేళ్ల బాబు, రెండేళ్ల పా పక్కనే ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పాప నడుచుకుంటూ హైవే వైపు బయలు దేరింది. చిన్నారి చెల్లి రోడ్డు వైపునకు వెళ్లపోతుండడం చూసిన పిల్లాడు.. వెంటనే ఆమెను ఆపడానికి పరుగులు తీశాడు. కానీ తిరిగి వచ్చి తల్లికి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె డాన్స్ చేస్తూ బిజీగా ఉంది. అందుకే పట్టించుకోలేదు. పైగా పిల్లాడిని కూడా తనతో పాటు డాన్స్ చేయాలని చెప్పింది.


కానీ పిల్లాడు మాత్రం చెల్లి రోడ్డుపైకి వెళ్లిపోతోందమ్మా అంటూ చెబుతుండగా.. అప్పుడు ఆ రీల్స్ పిచ్చి తల్లి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ హైవేకి రెండగులు దూరంలో పాప కనిపించింది. అంతే ఆమె వెంటనే కంగారుగా పరుగులు తీసింది. ప్రమాదం అంచున ఉన్న తన పాపను పట్టుకొని వెనక్కు తీసుకువచ్చింది. ఈ ఘటన చూసిన వారెవరైనా ఆ యువతి.. తన పిల్లల కంటే సోషల్ మీడియాకు వైరల్ వీడియోలకే ప్రాధాన్యం ఇస్తోందని భావిస్తారు.

Also Read: పుష్ప 2 సినిమా.. ప్రేక్షకుడి చెవి కొరికేసిన క్యాంటీన్ ఓనర్

డిసెంబర్ 9, 2024న ఈ వీడియోని ట్విట్టర్ ఎక్స్ లో @gharkekalesh అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోకు విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి. వీడియో చూసిన నెజినెన్లందరూ ఆ తల్లిపై మండిపడుతున్నారు.

ఒక యూజర్ అయితే.. “ఇది కేవలం ఒక తల్లి గురించి కాదు. సమాజంలో ఇది చాలా పెద్ద ప్రాబ్లెం. సోషల్ మీడియా అంటే అందరికీ వ్యసనంగా మారిపోయింది. సోషల్ మీడియా వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎవరో అపరిచితులు మన వీడియోలు ఇష్టపడతారని.. వారిని మెప్పించడానికి తన కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నాం. కుటుంబమంతా డిన్నర్ చేస్తున్న సమయంలో అందరూ ఫోన్లలో చాటింగ్ చేస్తున్నారు.. వీడియోలు చూస్తూ కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల జనం కలిసి ఉండాల్సింది పోయి ఏకజీవులుగా మిగిలిపోతున్నారు.” అని వ్యాసం రాశాడు.

ఇంకొక యూజర్ అయితే టిక్ టాక్ లాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. జీవితంలో ఇతరుల మెప్పు పొందేందుకు కుటుంబాల భద్రతను ఫణంగా పెట్టడం సరికాదని వాదించాడు.

మరొక యూజర్ అయితే.. ” వీడియో చూసి.. వీడియోలో ఆమె డాన్స్ యావరేజ్ గా చేసింది. డ్రెస్ కూడా ఓకే. కానీ తల్లి బాధ్యతలు పూర్ గా ఉన్నాయి. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం.” అని రాశాడు.

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×