BigTV English

Car Accident: అదుపుతప్పి బావిలో పడిన కారు.. స్పాట్ లోనే ముగ్గురు మృతి

Car Accident: అదుపుతప్పి బావిలో పడిన కారు.. స్పాట్ లోనే ముగ్గురు మృతి

Car Accident: అన్నమయ్య జిల్లా పీలేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు కారు అద్దాలు పగులగొట్టుకోని బయటపడ్డారు. మృతులను కర్ణాటకలోని కోలార్ వాసులుగా గుర్తించారు. పీలేరుకు క్యాటరింగ్ చేయడానికి వచ్చినట్టుగా గుర్తించారు.


మృతులను శివయ్య, గంగన్న, లోకేష్ గా గుర్తించారు. సునీల్ ,తిప్పారెడ్డి అనే ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను, మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తత్తుకుడిలో నీటికుంటలోక్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు.. మరో ముగ్గురిని స్థానికి కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తమిళనాడు జిల్లాలో మరో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. కరూర్‌లో బెంగళూరు నుండి తమిళనాడులోని నాగర్ కోయిల్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రైవెల్ బస్సు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు డ్రైవర్ ఫ్లైఓవర్ కిందకు దిగుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత బస్సు బోల్తాపడి ఎదురుగా వస్తున్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం.. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్ మీర్‌పేట పరిధిలోని మంత్రాలచెరువు దగ్గర ఓపెన్‌జిమ్‌లో నిన్న ప్రమాదం జరిగింది. జిమ్‌లోని ఎక్విప్‌మెంట్ మీద పడి ఐదేళ్ల నిఖిల్ మృతి చెందాడు. అప్పటి వరకు తోటిపిల్లలతో ఆడుకుంటూ.. సంతోషంగా ఉన్న బాలుడు.. మృత్యుఒడికి చేరాడు. బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కడుపుకోత భరించలేక.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: సికింద్రాబాద్ స్వప్నలోక్ ఘటన‌.. 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు

గతంలో మీర్‌పేటలోని మంత్రాల చెరువు వాక్‌వేలో… 20 లక్షలతో చిల్ట్రన్స్‌ పార్క్‌, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని మాత్రం నియమించలేదు. దీంతో.. పర్యవేక్షణ కొరవడింది. ఈ పొరపాటు.. ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. మంత్రాల చెరువు దగ్గర నారాయణరావు కాలనీలో ప్రసాద్‌-వాణి దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు నిఖిల్‌ ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో.. పిల్లలతో కలిసి చెరువు దగ్గరున్న పార్క్‌లో ఆడుకునేందుకు వెళ్లాడు నిఖిల్‌. పక్కనే ఉన్న ఓపెన్ జిమ్ దగ్గరకు ఆడుకుంటున్నారు. ఇంతలో భారీ ఐరెన్ ఎక్విప్‌మెంట్ బాలుడిపై పడింది. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను… ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతిచెందాడని వైద్యులు ధృవీకరించారు.

 

Related News

TDP vs YCP: దుర్గా దేవి నిమజ్జనోత్సవంలో.. టీడీపీ – వైసీపీ ఘర్షణ..

Kadapa Crime News: కొడుకు రాసిన రక్తచరిత్ర.. తల్లిని కత్తితో గొంతుకోసి

Road Accident: హైవేపై ఘోర ప్రమాదం.. బ‌స్సుల మ‌ధ్య ఇరుక్క‌పోయిన‌ కారు.. కళ్లు చెదరే దృశ్యాలు

Road Accident: బీభత్సం సృష్టించిన ట్రాక్టర్.. స్పాట్‌లో ఇద్దరు మృతి

Telangana Student Dead: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Hyderabad Murder Case: ఆ పాపను చంపింది వాళ్లే.. కాళ్లు, చేతులు కట్టేసి.. నీళ్ల ట్యాంకులో పడేసి.. మాదన్నపేట మర్డర్ మిస్టరీ వీడింది!

Chain Snatching Gang Arrest: యూపీలో విశాఖ పోలీసులపై తిరగబడ్డ జనం.. చైన్ స్నాచింగ్ ముఠా సభ్యుడు అరెస్ట్

Jagtial News: పెళ్లయిన ఆరురోజులకే.. నవ వధువుకి నిండు నూరేళ్లు, జగిత్యాలలో దారుణం

Big Stories

×