CM Chandrababu: సీఎం చంద్రబాబు బీజేపీ నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి.
మాటల సందర్భంగా శాలువాతో కప్పుకుని ఉన్న సుజనాను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కుడి చేతిపైనున్న శాలువాను ఎత్తి చూపుతూ జరిగిన గాయం గురించి వివరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అసలు చేతికి గాయం ఎలా తగిలిందని అడిగారు.
కొద్ది రోజుల కిందట లండన్ వెళ్లిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రమాదవశాత్తూ జారిపడిపోయారు. ఈ ఘటనలో సుజనా కుడి భుజానికి తీవ్ర గాయం అయ్యింది. వెంటనే అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ నిర్వహించారు.
వైద్యుల సలహా మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పరామర్శ అనంతరం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సుజనా చౌదరి. వారి ఆదరణ, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడు బలాన్ని ఇస్తాయన్నారు. భగవంతుని ఆశీస్సులతో త్వరలో కోలుకుని ప్రజాసేవకు పునరంకితం అవుతానని ఇన్‌స్ట్రాలో రాసుకొచ్చారు.
ALSO READ: పీఎం మోదీని కలిసిన లోకేష్ ఫ్యామిలీ.. గిఫ్ట్ అదుర్స్
గతంలో సుజనాచౌదరి టీడీపీలో ఉండేవారు. రాజ్యసభ ఎంపీగా పని చేశారు. అయితే 2018లో బీజేపీకి టీడీపీ రాం రాం చెప్పేసింది. ఆ సమయంలో సుజనాతోపాటు టీడీపీకి చెందిన మరో ముగ్గురు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరినా ఆ ముగ్గురు నేతలు నిత్యం చంద్రబాబుతో టచ్‌లో ఉన్న విషయం తెల్సిందే.