BigTV English

Swapnalok Fire Incident: సికింద్రాబాద్ స్వప్నలోక్ ఘటన‌.. 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు

Swapnalok Fire Incident:  సికింద్రాబాద్ స్వప్నలోక్ ఘటన‌.. 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు

Swapnalok Fire Incident: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఎట్టకేలకు పోలీసుల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఘటనలో ఆరుగురు చావుకు కారణమైన 13 మందిని నిందితులుగా చేర్చారు. ఆయా వ్యక్తులు చనిపోవడానికి గల కారణాలు ఛార్జిషీటులో క్లియర్‌గా వివరించారు పోలీసులు.


సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో రెండేళ్ల కిందట అంటే 2023 మార్చి 16న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత స్పాట్‌‌లో ఆరుగురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు గల కారణాలను విశ్లేషిస్తూ పత్రికల్లో వచ్చిన కథనాలపై హైకోర్టు సుమోటోగా తీసుకుంది.

ఈ క్రమంలో సీఎస్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, అగ్నిమాపక శాఖ డీజీ, హైదరాబాద్ కలెక్టర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసు లకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ఈ ఘటనలో క్యూనెట్ సంస్థకు చెందిన ఆఫీసు దగ్ధమైంది. మృతి చెందిన ఆరుగురు ఆ సంస్థలో పని చేస్తున్నవారేనని దర్యాప్తులో తేలింది. చివరకు దీనికి సంబంధించిన ఛార్జిషీటు దాఖలు చేశారు పోలీసులు. మొత్తం 13 మందిని నిందితులుగా తేల్చారు. ఆరుగురు చనిపోవడానికి కారణం వీరేనని పేర్కొన్నారు.

ALSO READ: ప్రేమజంట ఫోటోలు తీసి అదే పని, ఓ కానిస్టేబుల్ దారుణాలు

క్యూనెట్ సంస్థకు చెందిన ఇద్దరు, స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు, అసోసియేషన్‌కు చెందిన వ్యక్తులను నిందితులుగా ప్రస్తావించారు. ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేశారని తేల్చారు. ఈ క్రమంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డర్లు ప్రధాన నిందితులుగా ప్రస్తావించింది.

ఎగ్జిట్ పాయింట్ వద్ద వేస్ట్ మెటీరియల్ డంపు చేయడం వల్ల ఆరుగురు ప్రాణాలు రక్షించుకోలేకపోయారని తెలియజేశారు. వేస్ట్ మెటీరియల్ అక్కడ లేకుంటే ఆ ఆరుగురు ప్రాణాలతో బయటపడేవారని తేల్చారు.

ఈ ఘటనతో స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న క్యూనెట్ సంస్థ అక్రమాలు తెరపైకి వచ్చాయి. అత్యధిక కమీషన్ ఇస్తామని అమాయకులను వలలో వేసుకుంది. తద్వారా పెట్టుబడులు పెట్టించింది. వారి ద్వారా పలు వస్తువులు కొనుగోలు చేయించి నిషేధిత గొలుసు కట్టు వ్యాపారం చేయించింది.

ఈ సంస్థ అక్రమ కార్యకలాపాలపై గతంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 38 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ సంస్థ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఆ సంస్థకు చెందిన రూ.137 కోట్లను స్తంభింపజేసిన విషయం తెల్సిందే.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×