Visakhapatnam: విశాఖ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెందుర్తి సమీపంలోని అప్పికొండ త్రినాథ్, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. త్రినాథ్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు. అమ్మవారి ఊరేగింపులో డీజే శబ్ధాలకు భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. పాట పూర్తైన సమయానికి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నిరాశ పోయారు. వెంటనే త్రినాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు గుర్తించారు.