E-Paper
Advertisement

విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!

విశాఖలో ఘోరం.. పార్టీ అని పిలిచి యువతి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్!
Advertisement

Visakhapatnam: విశాఖపట్నంలోని బి స్క్వేర్ హోటల్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నమ్మిన స్నేహితులే కాలయముళ్లలా మారతారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. సరదాగా గడుపుదాం, పార్టీ చేసుకుందాం అని పిలిచి.. ప్రాణ స్నేహితురాలిని అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది.

శాంతి కుమారి అనే యువతి రాత్రి 9 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లింది. అక్కడ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో చిన్నపాటి ఘర్షణ మొదలైనట్లు తెలుస్తోంది. ఆ గొడవ కాస్తా ముదిరి, ఆగ్రహానికి గురైన స్నేహితులు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే, చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. ఆమెకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిందని, అందుకే చనిపోయిందని నమ్మబలికే ప్రయత్నం చేశారు.

Advertisement

కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు నిజం బయటపడింది. అది సహజ మరణం కాదని, కొట్టి చంపారని నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు యువకులు, ఒక యువతిని నిందితులుగా గుర్తించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. నమ్మిన వాళ్లే నట్టేట ముంచుతారని అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. పార్టీ పేరుతో ప్రాణాలు తీసిన ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read:  అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×