E-Paper
Advertisement

Balapur Murder: హైదరాబాద్‌లో దారుణం.. అమ్మాయితో ప్రేమ వ్యవహారం, కత్తులతో కిరాతకంగా పొడిచి..?

Balapur Murder: హైదరాబాద్‌లో దారుణం.. అమ్మాయితో ప్రేమ వ్యవహారం, కత్తులతో కిరాతకంగా  పొడిచి..?
Advertisement

Balapur Murder: స్నేహానికి వెన్నుపోటు పొడిచారో ఇద్దరు యువకులు. ప్రాణానికి ప్రాణంగా ఉండాల్సిన మిత్రుడినే అంతమొందించాలని కుట్ర పన్నారు. ప్రేమ వ్యవహారం చిచ్చు పెట్టడంతో..  కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

హైదరాబాద్‌ వట్టెపల్లి ప్రాంతానికి చెందిన రిహాన్, శానవాజ్, మోహిజ్ ముగ్గురు స్నేహితులు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురూ కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో..  సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో బాలాపూర్‌లోని ఎర్రకుంట వద్దకు చేరుకోగానే అసలు రంగు బయటపెట్టారు.

Advertisement

పోలీసుల సమాచారం ప్రకారం..  అమ్మాయితో ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎర్రకుంట వద్ద నిందితులు రిహాన్‌తో గొడవకు దిగారు. మాట మాట పెరగడంతో ముందే పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తులతో శానవాజ్, మోహిజ్ ఒక్కసారిగా రిహాన్‌పై విరుచుకుపడ్డారు. శరీరంపై పలుచోట్ల విచక్షణారహితంగా పొడవడంతో రిహాన్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.

స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన రిహాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. చిన్న వయసులోనే యువకులు ఇలాంటి దారుణాలకు పాల్పడటం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×