E-Paper
Advertisement

Pawan Kalyan: హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan: హైకోర్టును ఆశ్రయించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌
Advertisement

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్దాఖలు చేశారు. తన వ్యక్తిగత హక్కులు, గౌరవానికి భంగలం కలగకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. పవన్పిటిషన్పై ఇవాళ (డిసెంబర్‌ 22) న్యాయస్థానంలో విచారణ జరిగింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వాయిస్వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా నిరోధించాలని పవన్ ఈ పిటిషన్‌లో కోరారు.

ప్రతిష్టను దిగజార్చేలా..

Advertisement

ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం సోమవారం విచారణ జరిపిందిఈ సందర్భంగా పవన్ తరపున న్యాయవాది జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికలు, ఈ-కామర్స్ సైట్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తన ప్రతిష్టను దిగజార్చేలా లేదా తన అనుమతి లేకుండా తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కీలక రాజ్యాంగ పదవిలో ఉన్నందున, తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లడం వల్ల తన ప్రజా జీవితంపై ప్రభావం పడుతుందని పవన్ తన పిటిషన్ పేర్కొన్నారు.

వ్యక్తిత్వ హక్కులను కాపాడండి

దీనిపై ఆయన తరపు న్యాయవాది సాయి దీపక్కోర్టులో వాదనలు వినిపించారు. ఆయన వాదనలు విన్న కోర్టు.. వారి అనుమతి లేకుండ వారి ఫోటోలు, వాయిస్‌, వీడియోలు వాడిన సోషల్మీడియా సంస్థలపై 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలకు తీసుకోవాలని ఆదేశించింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ, సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఆయన ఇమేజ్‌ను వాడుతున్న లింకులను తొలగించాలని కూడా కోర్టు సూచించినట్లు సమాచారం లబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలపై న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Also Read: Dhurandhar 2: ధురందర్‌’ తెలుగు రిలీజ్ ఇక లేనట్టే.. అప్పుడే సీక్వెల్కి ప్లాన్‌!

చర్యలకు ఆదేశించిన కోర్టు

అలాగే గతంలో జూనియర్ఎన్టీఆర్వేసిన పిటిషన్పై కూడా నేడు విచారణ జరిగింది. వీరిద్దరి పిటిషన్ను న్యాయవాది జె సాయి దీపక్కోర్టులో వాదనలు వినిపించారు. కాగా గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులను కాపాడంటూ కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యక్తికి సంబంధించి వారి పేరు, గొంతు, సంతకం లేదా ముఖచిత్రాన్ని వారి అనుమతి లేకుండా ఇతరులు వాణిజ్యపరంగా వాడుకోకుండా ఉండే హక్కునే ‘పర్సనాలిటీ రైట్స్’ అంటారు. గతంలో అమితాబ్బచ్చన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోలు వ్యక్తిత్వ హక్కులను కోసం కోర్టును ఆశ్రయించి సానుకూలా తీర్పుని పొందారు.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×