BigTV English

Goa News: పెళ్లి పేరుతో గోవాకు.. ప్రియురాలి గొంతు కోసి, ఆ తర్వాత బెంగుళూరులో ప్రత్యక్ష్యం

Goa News: పెళ్లి పేరుతో గోవాకు.. ప్రియురాలి గొంతు కోసి, ఆ తర్వాత బెంగుళూరులో ప్రత్యక్ష్యం

Goa News: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు గోవాను తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. తనతో వచ్చింది కోరుకున్న ప్రియుడని అనుకుందిగానీ, యముడని నిర్థారించుకోలేక పోయింది ఆ యువతి. సంచలనం రేపిన ఈ ఘటన గోవాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?


బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల సంజయ్ కెవిన్.. అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రోష్ని మోసెస్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇలా ఎంతకాలం అంటూ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్నారు. అందుకు గోవా సరైన ప్రాంతమని డిసైడ్ అయ్యారు. వీరిద్దరూ బెంగళూరు నుంచి గోవాకు బయలుదేరి వెళ్లారు.

వారి మధ్య అక్కడ ఏం జరిగిందో తెలియదు. రెండు రోజుల క్రితం రోష్నిని హత్య చేశాడు సంజయ్. ప్రియురాలి మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో పడేశాడు. అక్కడిని నుంచి సైలెంట్‌గా బెంగుళూరుకి వచ్చేశాడు. రెండురోజుల కిందట అటవీ ప్రాంతంలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, యువతిని గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. యువతిని రోష్ని మోసెస్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని లభించిన ఆధారాలతో విచారణ మొదలుపెట్టారు. నిందితుడు సంజయ్ కెవిన్‌గా గుర్తించారు పోలీసులు. అయితే నిందితుడు ఏప్రాంతానికి చెందినవాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: హనీమూన్ హత్య మాదిరి.. పెళ్లయిన 36 రోజులకే చికెన్ డిష్‌లో

హత్య జరిగిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని కనుగొన్నారు. నిందితుడు బెంగళూరు సిటీకి చెందినవాడని గుర్తించడం, ఆపై అతడ్ని అరెస్టు చేయడం జరిగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ హత్య వెనుక అసలు కారణమేంటి? అనేదానిపై ఆరా తీస్తున్నారు. ప్రేమ, పెళ్లి ప్రతిపాదన కారణంగా ఇరువురు మధ్య గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

రోష్ని డెడ్‌బాడీ వద్ద లభించిన వస్తువుల‌తో దర్యాప్తు చేపట్టారు. బస్సు టికెట్ ఎవరు కొనుగోలు చేశారు? అనేది గుర్తించారు. టికెట్‌ను నిందితుడు సంజయ్ బుక్ చేసుకున్నట్లు తేలింది. ఆ టికెట్ ఆధారంగా సంజయ్‌ గురించి కూపీ లాగారు.  చివరకు అతడ్ని హుబ్లిలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి విచారణ నిమిత్తం గోవాకు తీసుకెళ్లారు పోలీసులు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కదంబ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో కర్ణాటక నుంచి గోవాకు వీరిద్దరు వెళ్లారు. నేరుగా గోవాలో దిగకుండా మారుమూల ప్రాంతంలో ఎందుకు దిగారు? ఇంకాదానిపై స్పష్టత రావాల్సివుంది. రోష్ని మృతదేహం రోడ్డు పక్కన 100 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కనుగొన్నారు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×