52 Kg Gold in Car: మధ్యప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ సంస్థల అవినీతిపై వరుస దాడులతో అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. నగరంలోని భారీ స్థాయిలో పన్నుల్ని ఎగవేస్తున్న అక్రమార్కులపై దాడులతో జరుగుతుండగా.. వాటిని నుంచి తప్పించుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా 52 కేజీల బంగారం, రూ.40 కోట్ల నగదు తరలిస్తున్న ఓ కారు.. భోపాల్ లోని అడవీ ప్రాంతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ కు పట్టుబడింది. దీంతోో.. ఇలాంటి డబ్బు, అభరణాలు ఏ మేరకు దొంగదారిలో తప్పించుకుపోతున్నాయో అంటూ చర్చలు మొదలైయ్యాయి. ఈ కారును ఛేదించేందుకు పోలీసులు.. సినిమాల్లో చూపించేలా భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఆసక్తిగా మారింది.
భోపాల్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల కార్యకలాపాలపై కొన్నాళ్లుగా దృష్టి పెట్టిన ఐటీ డిపార్ట్మెంట్.. ప్రభుత్వానికి చెల్లిచాల్సిన పన్నులు పెద్ద మొత్తంలో ఎగవేస్తున్నట్లు గుర్తించింది. దీంతో.. వారికి అనుమానులున్న సంస్థలపై వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో.. ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ తో పాటు ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, లోకాయుక్త సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాస్తుల్ని దొంగ దారుల్లో తప్పించేందుకు.. కొందరు ప్రయత్నిస్తున్నారు. అందులో ఓ రియాల్టర్ కి చెందిన భారీ అక్రమాస్తుల్ని ఈడీ గుర్తించి, స్వాధీనం చేసుకుంది.
తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారులకు అక్రమ నగదు, బంగారాన్ని తరలిస్తున్నట్లుగా ఓ సమాచారం అందింది. దాంతో.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఏకంగా వంద మంది పోలీసులు, 30 వాహనాలతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. అధికారుల నిఘాలోని ఓ రియల్టర్ పేరుపై రిజిస్టర్ అయిన కారులో ఈ నగదు తరలిపోతున్నట్లు తెలియడంతో.. వీరంతా ఆ కారును వెంబడించి భోపాల్ లోని మిండోరీ అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. తప్పించుకుందామనుకుని, చిక్కుకుపోయాడు.. ఆ రియాల్టర్.
భోపాల్ నగంరోలని అక్రమార్కులపై గత కొద్దిరోజుల నుంచి గట్టి నిఘా పెట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. నగరంలోని దాాదాపు 51 స్థావరాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. త్రిశూల్ కన్ స్ట్రక్షన్, క్వాలిటీ గ్రూప్, ఇషాన్ గ్రూప్ సంస్థలపై ఈ దాడులు నిర్వహించగా… ఆయా చోట్ల అనేక అక్రమాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మిగతా రియాల్టర్లలోనూ భయం మొదలైంది. అధికారుల కన్నుగప్పి.. తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
Also Read : బ్యాంకులో కన్నం.. కోట్ల విలువ చేసే డబ్బు బంగారం చోరీ.. అలారం మోగలేదు!
కాగా.. గతంలో రీజనల్ ట్రాన్స్ ఫోర్ట్ ఆఫీస్ లో కానిస్టేబుల్ గా పనిచేసిన సౌరభ్ శర్మ అనే వ్యక్తి.. ఉద్యోగానికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. ఇతని కార్యకలాపాలపై నిఘా పెట్టిన అధికారులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిశాయి. ఇతను చేస్తున్న వ్యాపారం లావాాదేవీలపై సోదాలు నిర్వహించిన అధికారులు.. ఏకంగా రూ. కోటి రూపాయల నగదు. 40 కేజీల వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే.. ఈ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఈ స్థాయిలో అక్రమాస్తులు కూడబెడితే.. ఏళ్లుగా ఈ రంగంలో ఉన్నవాళ్లు ఇంకెంత కూడబెట్ట ఉంటారో అన్న చర్చ భోపాల్ నగరంలో హాట్ టాపిక్ అవుతుంది.