Kavach system in Trains: తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నష్ట నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. అందులో భాగంగానే ‘కవచ్’ అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కవచ్’ అనేది ఆటోమేటెడ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది ట్రాక్ పై ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం ‘కవచ్’ వ్యవస్థను పలు మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది రైల్వేశాఖ. ఈ వ్యవస్థ పకడ్బందీగా పని చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పలు మార్లు వెల్లడించారు. తాజాగా మరోసారి ‘కవచ్’ ఎంత అద్భుతంగా పని చేస్తుందో తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పొగమంచు ఉన్నా నో ప్రాబ్లం..
శీతాకాలంలో రైళ్లకు ఎదురయ్యే సమస్యలలో కీలకమైనది పొగమంచు. తీవ్రమైన పొగమంచు కారణంగా పలు రైళ్లు రద్దు అవుతూ ఉంటాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయి. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ‘కవచ్’ వ్యవస్థతో దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ రైలు దూసుకెళ్తోందంటూ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేశారు. “రైలు ముందు పొగమంచు కమ్ముకుపోయినా, లోకో పైలెట్ బయటకు చూడకుండా ‘కవచ్’ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు” అని రాసుకొచ్చారు. వాస్తవానికి పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కవచ్ తో ఆ సమస్యకు చెక్ పడుతోందని రైల్వేమంత్రి వివరించారు. ఈ వ్యవస్థ సాయంతో బయట ఏ సిగ్నల్ పడిందనేది క్యాబిన్ లోని మానిటర్ లోనే లోకో పైలెట్ చూసుకునే అవకాశం ఉంది.
Dense fog outside. Kavach shows the signal right inside the cab. Pilot doesn’t have to look outside for signal. pic.twitter.com/cdQJDYNGrk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 21, 2024
Read Also: IRCTC eWalletతో ఈజీగా టికెట్ల బుకింగ్, స్టెప్ బై స్టెప్ ఇలా ఫాలో అవ్వండి!
ఇంతకీ ‘కవచ్’ అంటే ఏంటి?
భారతీయ రైల్వేలో భద్రతను మరింత పెంచేందుకు తీసుకొచ్చిన రక్షణ వ్యవస్థ ‘కచవ్’. ఇదో అధునాతన ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఎస్ఐఎల్-4 స్టాండర్డ్స్ కు అనుగుణంగా రూపొందించబడింది. ఇది రైలు వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. రైలు పట్టాల మీద ఏవైనా అవాంతరాలు ఉన్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, ముందుగానే హెచ్చరిస్తుంది. ఒకవేళ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ముందు ప్రమాదకర పరిస్థితులు ఉన్నా, లోకో పైలెట్ స్పందించకపోతే, కవచ్, ఆటోమేటిక్ గా రైలుకు బ్రేకులు వేస్తుంది. ‘కవచ్’ రైలుకు ముందున్న ప్రతికూల పరిస్థితులను తెలుసుకునేందుకు ట్రాక్ ల వెంట, స్టేషన్ యార్డులలో ఉంచిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగులను ఉపయోగించుకుంటుంది. రైలు వెళ్తున్న సమయంలో ముందు ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఇంజిన్ క్యాబిన్ లో ఉన్న మానీటర్ మీద హెచ్చరికలు కనిపిస్తాయి. అంతేకాదు, రైళలు వెనుకనుంచి ఢీకొనకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. వచ్చే 5 సంవత్సరాలలో దేశ వ్యాప్తంగా సుమారు 45,000 కిలో మీటర్ల మేర ఈ ‘కవచ్’ వ్యవస్థను రూపొందించాని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నది.
Read Also: ఓర్నీ.. రైలు కింద పడ్డా బతికేశాడు, అదెలా? ఇదిగో ఈ వీడియో చూడండి!