Bangalore News: ‘సంసారం ఒక చదరంగం.. అనుబంధం ఒక రణరంగం.. స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో.. ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో’ ఈ సాంగ్.. పైన కనిపిస్తున్న టెక్కీకి అతికినట్టు సరిపోతుంది. ఆ పాట సందర్భం వేరు.. టెక్కీ జీవితంలో జరుగుతున్నది మరొకటి. ఆయన వ్యవహారం చివరకు పోలీసుస్టేషన్ వరకు చేరింది. అసలేం జరిగింది? లోతుల్లోకి వెళ్తే..
భార్య వేధిస్తోందని భర్త.. భర్త వేధిస్తున్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వింటుంటాము. ఇక్కడ అలాంటి సమస్య ఇక్కడ లేదు. కాకపోతే చీటికి మాటికీ భార్య సతాయించడంతో తట్టుకోలేకపోయాడు. రెండేళ్లుగా ఈ నరకం అనుభవిస్తున్నాడు. చివరకు భార్య వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఆశ్రయించాడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
శ్రీకాంత్ లైఫ్‌లో ఏం జరిగింది?
పైన కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్రీకాంత్. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సరిగ్గా మూడేళ్ల కిందట ఆయనకు ఓ యువతితో పెళ్లయ్యంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? లేక పెద్దల చేసిన పెళ్లా అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. విచిత్రం ఏంటంటే మ్యారేజ్ అయిన నుంచి ఒక్కరోజు కూడా సరిగా సంసారం చేయలేదు.
పిల్లలు కావాలని శ్రీకాంత్ తన భార్యను కోరినప్పుడు అప్పుడేం తొందరేంటంటూ తల తిక్క సమాధానాలు చెప్పడం మొదలు పెట్టేది. 60 ఏళ్లు వచ్చినప్పుడు ఆ సంగతి చూద్దామని.. భర్తకు ఆగ్రహం వచ్చేలా చేసేది. తప్పదనుకుంటే ఎవరినైనా దత్తతకు తీసుకొందామని ఉచితంగా భర్తకు సలహాలు ఇచ్చేది.
ALSO READ: మా కూతురే అల్లుడ్ని చంపింది.. నేవీ అధికారి హత్య కేసులో షాకింగ్ నిజాలు
భార్యభర్తల మధ్య ఎడబాటు
భార్యను ముట్టుకుంటే ఓ రేంజ్‌లో విరుచుకుపడేది. ఇంకోసారి ఇలా చేస్తే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడం మొదలుపెట్టింది. రోజులు, వారాలు, చివరకు నెలలు సైతం గడిచాయి. అయినా ఇద్దరి మధ్య ఎడబాటు తప్పలేదు. భర్తకు తీవ్రమైన చిరాకు, కోపం వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాంత్.
ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయం ఇరు ఫ్యామిలీ సభ్యులకు తెలుసా? తెలీదా? అనేది పక్కన బెడదాం. ఎందుకంటే పెళ్లి తర్వాత ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి భార్యభర్తలు వెళ్లిపోతున్న రోజులివి. ప్రస్తుత రోజుల్లో ఆలుమగలు మధ్య ఏం జరుగుతుందో పక్కింటివాడికి సైతం తెలీదు.
వర్క్ ఫ్రం హోమ్‌లో ఒకటే టార్చర్
నార్మల్‌గా ఐటీ ఉద్యోగాల్లో అప్పుడప్పుడు వర్క్ ఫ్రం హోం ఉంటుంది. ఇంట్లో డ్యూటీ చేస్తుంటే గట్టిగా పాటలు పెట్టి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదట భార్య. ఒకానొక దశలో విడాకులు తీసుకోవాలని భావించాడు. విడాకులు కావాలంటే తనకు రూ.45 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిందిట. అంతేకాదు ప్రతినెలా భరణం కింద కొంత ముట్టజెప్పాలన్నది భార్య డిమాండ్‌గా చెప్పుకొచ్చాడు.
అంత డబ్బు తానెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని వాపోయాడు. దగ్గరకు రావాలంటే రోజుకు ఐదువేలు ఇస్తానంటే వస్తానంటోందని వాపోయాడు. దీనికితోడు వీరిద్దరు మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే కూతురు ఎలాగూ తల్లిదండ్రులు సపోర్టు చేస్తారు.
ఇక్కడే అదే జరిగింది. చివరకు ఆమె వేధింపులను భరించలేదక బెంగుళూరులోని వయ్యాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యం తన భార్య వేధిస్తోందని పోలీసుల ముందు తన గోడు వెల్లగక్కాడు. మరి పోలీసులు శ్రీకాంత్ ఫ్యామిలీ సమస్యలకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.