BigTV English

Navy Officer Murder: మా కూతురే అల్లుడిని చంపింది.. నేవి ఆఫీసర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

Navy Officer Murder: మా కూతురే అల్లుడిని చంపింది.. నేవి ఆఫీసర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

Navy Officer Murder| విదేశాల నుంచి కూతరు పుట్టినరోజు కోసం వచ్చిన ఒక నేవీ ఆఫీసర్ కు అతని సోదరి వాట్సాప్ మెసేజ్ చేసింది. ఈ సారి హోలీ పండుగకు తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది. కానీ అతను తనకు వేరే కార్యక్రమాలున్నాయని.. హోలీ తరువాతే రాగలని మెసేజ్ చేశాడు. ఇలా ఆమె ఎన్నిసార్లు మెసేజ్ చేసినా.. అతను దాటవేస్తూ మెసేజ్ కు రిప్లై చేసేవాడు. ఫోన్ చేస్తే.. ఆన్సర్ చేసే వాడు కాదు. అయితే ఆ సమయంలో ఆ సోదరికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ మెసేజ్ లు చేసేది తన అన్న కాదని.. తన అన్న అప్పటికే హత్యకు గురయ్యాడని. ఆ నేవీ ఆఫీసర్ ను చంపిన వారే ఆ మెసేజ్ లకు రిప్లై ఇస్తున్నారు.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల కిందట పోలీసులు మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్ పుత్ శవాన్ని ఒక సిమెంట్ డ్రమ్ముల్లో ఉన్నట్లు కనుగొన్నారు. ఎంతగానో ప్రేమించిన భార్యే అతడిని హత్య చేసింది. అయితే సౌరభ్ భార్య ముస్కాన్ తో పాటు సౌరభ్ ప్రాణ స్నేహితుడు సాహిల్ శుక్లా కూడా ఈ కేసులో మరో హంతకుడు. భార్య, స్నేహితుడు కలిసి సౌరభ్ ను హత్య చేశారు. ముస్కాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్.. ఆమెను హనీమూన్ తీసుకెళ్లడానికి, ఆమె కోరుకున్న ప్రతీదీ నెరవేర్చడానికి తన శాయశక్తులా చేసేవాడు. ఆమె కోరిందని తన మర్చెంట్ నేవీ ఆఫీసర్ ఉద్యోగం కూడా వదిలేశాడు. వేరే కాపురం పెట్టాలని కోరితే.. తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి ఒక కొత్త ఇల్లు తీసుకున్నాడు.

వారిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. అయితే పాప పుట్టిన రెండేళ్ల తరువాత ఒక షాకింగ్ విషయం తెలిసింది. తన భార్య ముస్కాన్, తన ప్రాణ స్నేహితుడు సాహిల్ మధ్య అక్రమ సంబంధం ఉందని సౌరబ్ కు తెలియగానే అతడు తన సర్వస్వం కోల్పోయినట్లు కుంగిపోయాడు. తన భార్యతో అతని గొడవలు జరిగాయి. విడాకులు తీసుకుందామనుకున్నాడు. కానీ ముస్కాన్ తల్లిదండ్రులు వారిద్దరి చిన్నారి కూతురు చింకీ గురించి ఆలోచించమని ప్రార్ధించగానే.. తన భార్యకు మరో అవకాశం ఇచ్చాడు. అయితే ఇంట్లో ఉంటే తన భార్య చేసిన మోసం గుర్తుకొస్తూనే ఉంటుందని భావించి.. తిరిగి మర్చెంట్ నేవీ ఆఫీసర్ ఉద్యోగం లో చేరాడు. అయితే ఉద్యోగ రీత్యా అతనికి 2023లో లండన్ వెళ్లాల్సి వచ్చింది.


Also Read: దొంగనే దోచుకున్న దొంగ.. ఓర్నీ, వీడెవడో మహా కంత్రీలా ఉన్నాడే!

అలా వెళ్లిన సౌరభ్ తిరిగి ఫిబ్రవరి 24, 2025న తన కూతురి పుట్టిన రోజు కోసం ఇండియా వచ్చాడు. తన చిన్నారి కూతురితో సరదాగా సమయం గడుపుదామని ఇండియా వచ్చిన సౌరభ్ ను చూసి అతని స్నేహితుడు సాహిల్, భార్య ముస్కాన్ ఓర్వలేకపోయారు. ఎందుకంటే సౌరభ్ లండన్ వెళ్లిన సమయంలో వీరిద్దరూ మళ్లీ తమ అక్రమ సంబంధం కొనసాగించారు. ఇప్పుడు సౌరభ్ ఇండియాకు తిరిగి రావడంతో వారికి అడ్డుగా మారాడు. అందుకే సౌరభ్ ను చంపేందుకు ప్లాన్ వేశారు. రాత్రి సౌరభ్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపారు. సౌరభ్ నిద్రపోగానే సాహిల్ ని ముస్కాన్ ఇంట్లోకి పిలిచింది. ఇద్దరూ కలిసి సౌరభ్ గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత అతని శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక డ్రమ్ములో వేశారు. ఆ తరువాత డ్రముల్లో సిమెంట్ కాంక్రీట్ నింపారు.

అంతటితో ఆగక.. ముస్కాన్, సాహిల్ మనాలి టూర్ కు వెళ్లారు. అక్కడ మంచు కురుస్తోంది. అయితే వారితో చనిపోయిన సౌరభ్ ఫోన్ ని తీసుకోని వెళ్లారు. అందులో ఫొటోలు తీసి.. అతని సోషల్ మీడియాలో మనాలి టూర్ లో ఉన్నట్లు ఫొటోలు షేర్ చేస్తూ ఉన్నారు. అయితే సౌరభ్ కు అతని సోదరి, తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఆన్సర్ చేయడం లేదు. అతని భార్యకు ఫోన్ చేస్తే.. తనకు ఏమీ తెలియదు.. సౌరభ్ ఎక్కడికో బయటకు వెళ్లాడు. అని ఏదో ఒక సమాధానం చెప్పేది. అలా రెండు వారాల తరువాత సౌరభ్ తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ముస్కాన్ భయపడి తన తల్లిదండ్రులకు నిజం చెప్పేసింది. సాహిల్ ఇచ్చే డ్రగ్స్ కు అలవాటు పడి తాను తొందరిపడి హత్య చేశానని.. తన తల్లితో చెప్పింది. అయితే ముస్కాన్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి.. ముస్కాన్, సాహిల్ ను అరెస్టు చేయించారు. పోలీసులు సౌరభ్ శవమున్న సిమెంట్ డ్రమ్మున్ని స్వాధీనం చేసుకున్నాక.. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మీడియాతో ముస్కాన్ తల్లిదండ్రులు మాట్లాడారు. తమ అల్లుడు సౌరభ్ ఎంతో మంచివాడని, తమకు కొడుకుతో సమానమని చెప్పారు. తమ కూతురు ముస్కాన్ డ్రగ్స్ కు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేసే సాహిల్ వలలో పడిందని.. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు వారే తెలిపారు. తమ కూతురిని చట్టప్రకారం ఉరితీయాలని.. కోరారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×