Eluru News: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బస్సు ఢీ కొన్న ఘటనలో స్పాట్ లో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? కారణం ఎవరు? అతి వేగమే ప్రమాదానికి కారణమా?
అసలు ప్రమాదం ఎలా జరిగింది?
ఏలూరు సమీపంలో చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీ కొంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వారిలో కొందరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. క్షతగాత్రులను వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్కడి నుంచి ట్రావెల్ బస్సు వస్తోంది
వెంకటరమణ ట్రావెల్స్‌కి చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సు ఏలూరు జిల్లాకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఘటన సమయంలో ప్రయాణికులంతా గ్రాఢమైన నిద్రలో ఉన్నారు. ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
ALSO READ: కాబోయే భార్యని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు
ఏం జరిగిందో తెలుగుకునే లోపు ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. క్రేన్ సహాయంతో రహదారిపై ఉన్న బస్సును పక్కకు తొలగించారు పోలీసులు. అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
రంగంలోకి పోలీసులు
మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఏలూరు ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు ప్రయాణికులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారి నుంచి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే యాక్సిడెంట్స్ లో మృతి చెందిన ముగ్గురు ప్రయాణికుల వివరాలు తెలుసుకున్నారు పోలీసులు.
లోయలో పడిన లారీ ఎక్కడ?
మరోవైపు కడప జిల్లా మద్ది మడుగు ఘాట్ రోడ్డులో ఓ లారీ లోయలోకి పడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తోంది లారీ. అయితే చింక కొమ్మదిన్నె మండలంలోని మద్దిమడుగు ఘాట్‌లో నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయ్యింది.
అదుపు తప్పిన లారీ 50 అడుగుల లోయలో పడిపోయింది.లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లోయలోపడిన లారీ మూడు ముక్కలు అయ్యింది. కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. అక్కడ పరిస్థితి భీతావహంగా మారింది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోయలో లారీ పడిపోవడంతో సహాయక చర్యలు కష్టంగా మారింది. అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
ఏలూరు చొదిమెళ్ల వద్ద లారీని ఢీకొట్టి బోల్తా పడిన బస్సు
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం
20 మంది ప్రయాణికులకు గాయాలు pic.twitter.com/RwtmUeZ5Hy
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2025