E-Paper
Advertisement

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి టోకరా.. రూ. 24 కోట్లు స్వాహా!

డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి టోకరా.. రూ. 24 కోట్లు స్వాహా!
Advertisement

Digital Arrest: టెక్నాలజీ ఎంత పెరిగితే దాన్ని అడ్డు పెట్టుకుని మోసాలు చేసే కేటు గాళ్లు అంతకంటే వేగంగా అప్‌డేట్ అవుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈ రూ. 24 కోట్ల భారీ స్కామే దీనికి నిదర్శనం. ఒక 70 ఏళ్ల రిటైర్డ్ టీచర్‌ను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆమె అకౌంట్ ద్వారా ఏవో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయంటూ నమ్మించారు. చట్టాల గురించి పెద్దగా అవగాహన లేని సదరు వృద్ధురాలిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి, రోజుల తరబడి గృహనిర్భంధంలో ఉంచి ఏకంగా రూ. 24 కోట్లు నొక్కేశారు.

అయినా వాళ్ల ఆశ తీరలేదు. ఇంకా డబ్బు కావాలని బెదిరించడంతో.. ఆమె తన దగ్గరున్న 1.3 కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ ఆమె టెన్షన్ చూసి మేనేజర్‌కు అనుమానం రావడంతో ఈ ఘోరమైన స్కామ్ బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు కొందరని అరెస్ట్ చేసి, రూ. 60 లక్షలు సీజ్ చేశారు.

Advertisement

నిజానికి చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఏ పోలీసో, సీబీఐ అధికారికో మిమ్మల్ని వీడియో కాల్స్‌లో గంటలు కొద్దీ కూర్చోబెట్టి విచారించరు, బెదిరించరు. సైబర్ క్రిమినల్స్‌కి లేఆఫ్స్ లేవు.. కేవలం పే ఆఫ్స్ మాత్రమే ఉంటాయి. ఇలాంటి మోసాల పట్ల మనం, మన ఇంట్లోని పెద్దవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

Also Read: ఆధార్ కొత్త నిర్ణయం.. ఆ యాప్ క్లోజ్, వినియోగదారులు డోంట్‌ వర్రీ

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×