Dulquer Salman: మలయాళ సినీ ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూపోయే ఈయనకు తాజాగా ఒక మహిళ భారీ షాక్ ఇచ్చింది. వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. అసలేం జరుగుతోంది అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
దుల్కర్ సల్మాన్ ‘వేఫేరర్ ఫిలిమ్స్’ అనే నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణ సంస్థలో అసోసియేట్ డైరెక్టర్ గా దినిల్ బాబు (Dinil babu) అనే వ్యక్తి పని చేస్తున్నారట. అయితే ఇతడు వేఫేరర్ ఫిలిమ్స్ పేరుతో తనను వేధించాడని, క్యాస్టింగ్ కౌచ్ కి గురి చేస్తున్నాడు అంటూ బాధిత యువతి తన ఫిర్యాదులో తెలిపింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని.. వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ద్వారా తనకు సినిమాలలో అవకాశాలు కల్పిస్తానని.. అయితే తాను చెప్పినట్టుగా రూమ్ కి రమ్మని తనను అవమానించాడు అంటూ కూడా బాధితురాలు వాపోయింది..
అంతేకాదు వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక కొత్త సినిమా నిర్మితమవుతోందని.. అయితే ఈ సినిమాలో నటించే విషయంపై మాట్లాడడానికి నేరుగా కలవాలని దినిల్ బాబు.. పనమ్మిల్లి నగర్ లోని వేఫేరర్ ఫిలిమ్స్ కార్యాలయం సమీపంలోని ఒక భవనంలోకి రమ్మని కోరాడు. అక్కడికి వెళ్ళగా దిలీప్ బాబు గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడం ప్రయత్నించారు. తనతో సహకరించకపోతే మలయాళ చిత్రాలలో అవకాశాలు రావని బెదిరించాడు అంటూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు ఇచ్చింది. అంతేకాదు ఆ యువతీ ఫిర్యాదులతో పాటు దినిల్ బాబు వాయిస్ మెసేజ్లను కూడా ఆమె బహిరంగపరిచింది.. కేసు నమోదు చేసుకున్న ఎర్నాకులం సౌత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అదే సమయంలో దినిల్ బాబు పై వేఫేరర్ ఫిలిమ్స్ సంస్థ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దినిల్ బాబుపై తేవర పోలీస్ స్టేషన్ లో అలాగే ఫెఫ్కా కి కూడా ఫిర్యాదు చేసింది. తమ సంస్థతో అతడికి ఎటువంటి సంబంధం లేదని, వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మించిన ఏ చిత్రంలో కూడా అతను భాగం కాలేదని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తమ నిర్మాణ సంస్థకు చెడ్డ పేరు తీసుకొచ్చినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. ఎవరు కూడా ఇలాంటి నకిలీ కాస్టింగ్ కాల్స్ కి మోసపోవద్దు అని, అవసరమైతే దుల్కర్ సల్మాన్ నుంచి లేదా వేఫేరర్ ఫిలిమ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా మాత్రమే నటీనటుల కోసం కాల్ చేస్తామని, ఇది అందరూ గమనించాలి అంటూ ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏది ఏమైనా ఈ విషయం దుల్కర్ సల్మాన్ కు భారీ షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. మరి దీనిపై హీరో ఏదైనా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:Vijay Antony: ఓటీటీలోకి విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?